Telugu Global
Cinema & Entertainment

రజనీకాంత్ మార్కెట్... పడిపోయిందిలా

శివాజీ సినిమా తెలుగులో 50 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. ఆ టైమ్ లో ఓ డబ్బింగ్ సినిమాకు అంత పెట్టారని తెలుసుకొని ఆశ్చర్యపోయింది తెలుగు సమాజం. ఆ తరువాత రోబో సినిమా కూడా తెలుగులో భారీ రేటు పలికింది. కానీ ప్రస్తుతం రజనీకాంత్ సినిమాలకు అంత మార్కెట్ లేదు. వరుసగా ఫ్లాపులు వస్తుండడంతో సూపర్ స్టార్ మార్కెట్ అమాంతం పడిపోయింది. రిలీజ్ కు రెడీ అయిన దర్బార్ సినిమాను 30 కోట్ల రూపాయలకు తెలుగులో కొనుగోలు […]

రజనీకాంత్ మార్కెట్... పడిపోయిందిలా
X

శివాజీ సినిమా తెలుగులో 50 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. ఆ టైమ్ లో ఓ డబ్బింగ్ సినిమాకు అంత పెట్టారని తెలుసుకొని ఆశ్చర్యపోయింది తెలుగు సమాజం. ఆ తరువాత రోబో సినిమా కూడా తెలుగులో భారీ రేటు పలికింది. కానీ ప్రస్తుతం రజనీకాంత్ సినిమాలకు అంత మార్కెట్ లేదు. వరుసగా ఫ్లాపులు వస్తుండడంతో సూపర్ స్టార్ మార్కెట్ అమాంతం పడిపోయింది.

రిలీజ్ కు రెడీ అయిన దర్బార్ సినిమాను 30 కోట్ల రూపాయలకు తెలుగులో కొనుగోలు చేశారంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ అందులో వాస్తవం లేదు. అంతకంటే తక్కువగా కేవలం 14 కోట్ల రూపాయలకే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయి. తిరుపతి ప్రసాద్ ఈ సినిమా రైట్స్ దక్కించుకున్నారు.

రజనీకాంత్ గత చిత్రం పేట సినిమాకు హిట్ టాక్ వచ్చినప్పటికీ వసూళ్లు రాలేదు. 13 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ ను కవర్ చేయడానికి నానా తంటాలు పడింది. ఇంకా చెప్పాలంటే బ్రేక్ ఈవెన్ దగ్గరకు వచ్చి ఆగిపోయింది. ఈసారి మురుగదాస్ దర్శకుడు కావడంతో రేటు 2 కోట్లు అదనంగానే పలికింది.

నైజాంలో ఈ సినిమా 5 కోట్ల 20 లక్షలకు, సీడెడ్ లో 3 కోట్లకు, ఆంధ్రా ప్రాంతంలో 6 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. అలా 14 కోట్ల 20 లక్షల రూపాయలకు అమ్ముడుపోయిన ఈ సినిమాకు సంక్రాంతి బరిలో కనీసం 15 కోట్ల రూపాయలు రావాలి.

First Published:  4 Jan 2020 9:00 PM GMT
Next Story