Telugu Global
Cinema & Entertainment

టాలీవుడ్ ను 'కబ్జా' చేస్తానంటున్న ఉపేంద్ర

చాన్నాళ్ల తర్వాత తెలుగులో స్ట్రయిట్ సినిమా చేస్తున్నాడు ఉపేంద్ర. గతంలో ఓం, ఎ, రా చిత్రాలతో పేరు తెచ్చుకున్న ఈ హీరో.. ఎప్పుడూ డబ్బింగ్ సినిమాలతోనే పలకరిస్తున్నాడు. ఈవీవీ సత్యనారాయణ టైమ్ లో స్ట్రయిట్ సినిమాలు చేసినప్పటికీ, తర్వాత మళ్లీ ఆపేశాడు. రీసెంట్ గా సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నటించినప్పటికీ అందులో అతడు హీరో కాదు. ఎట్టకేలకు ఉపేంద్ర హీరోగా తెలుగు స్ట్రయిట్ మూవీ ప్రారంభమైంది. ఈ సినిమాకు ‘కబ్జా’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. రమేష్ […]

టాలీవుడ్ ను కబ్జా చేస్తానంటున్న ఉపేంద్ర
X

చాన్నాళ్ల తర్వాత తెలుగులో స్ట్రయిట్ సినిమా చేస్తున్నాడు ఉపేంద్ర. గతంలో ఓం, ఎ, రా చిత్రాలతో పేరు తెచ్చుకున్న ఈ హీరో.. ఎప్పుడూ డబ్బింగ్ సినిమాలతోనే పలకరిస్తున్నాడు. ఈవీవీ సత్యనారాయణ టైమ్ లో స్ట్రయిట్ సినిమాలు చేసినప్పటికీ, తర్వాత మళ్లీ ఆపేశాడు. రీసెంట్ గా సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నటించినప్పటికీ అందులో అతడు హీరో కాదు.

ఎట్టకేలకు ఉపేంద్ర హీరోగా తెలుగు స్ట్రయిట్ మూవీ ప్రారంభమైంది. ఈ సినిమాకు ‘కబ్జా’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. రమేష్ ప్రసాద్ క్లాప్ కొట్టగా.. దర్శకుడు బి.గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. రామానాయుడు స్టుడియోస్ లో ఈ సినిమా ఘనంగా ప్రారంభమైంది.

ఈమధ్య కన్నడ సినిమాలన్నీ పాన్-ఇండియాపై కన్నేశాయి. ఇదంతా కేజీఎఫ్ ఎఫెక్ట్. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో, శాండిల్ వుడ్ నుంచి తాజాగా అతడే శ్రీమన్నారాయణ అనే పాన్ ఇండియా సినిమా వచ్చింది. ఇప్పుడు ఉపేంద్ర కూడా కబ్జాతో పాన్-ఇండియా లెవెల్లో రిలీజ్ కోసం ప్రయత్నిస్తున్నాడు.1947-80 మధ్య కాలంలో జరిగిన అండర్ వరల్డ్ డాన్ కథ ఇది.

First Published:  4 Jan 2020 7:02 PM GMT
Next Story