Telugu Global
Cinema & Entertainment

మహేష్, అల్లు అర్జున్... సంక్రాంతి దోపిడీకి ప్లాన్?

ఈ సంక్రాంతి వేళ నాలుగు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇందులో ప్రధానంగా మహేష్ బాబు ‘సరిలేరు’… అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురం’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి కోడిపుంజుల వలే తలపడబోతున్నాయి. దీంతో ఈ భారీ హీరోల సినిమాలను క్యాష్ చేసుకునేందుకు అటు నిర్మాతలు, ఇటు మల్టీఫ్లెక్సులు రెడీ అయ్యాయి. హైదరాబాద్ లో అనధికారికంగా అధిక ధరలకు టికెట్ రేట్లు పెంచేందుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. హైదరాబాద్ లో సాధారణ థియేటర్ లో టికెట్ ధర […]

మహేష్, అల్లు అర్జున్... సంక్రాంతి దోపిడీకి ప్లాన్?
X

ఈ సంక్రాంతి వేళ నాలుగు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇందులో ప్రధానంగా మహేష్ బాబు ‘సరిలేరు’… అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురం’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి కోడిపుంజుల వలే తలపడబోతున్నాయి.

దీంతో ఈ భారీ హీరోల సినిమాలను క్యాష్ చేసుకునేందుకు అటు నిర్మాతలు, ఇటు మల్టీఫ్లెక్సులు రెడీ అయ్యాయి. హైదరాబాద్ లో అనధికారికంగా అధిక ధరలకు టికెట్ రేట్లు పెంచేందుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది.

హైదరాబాద్ లో సాధారణ థియేటర్ లో టికెట్ ధర రూ.138. అయితే మల్టీప్లెక్స్ లు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా టికెట్ కు రూ.200 వసూలు చేస్తున్నాయి.

అయితే సరిలేరు, అల వైకుంఠపురం లాంటి భారీ చిత్రాలను తెలంగాణలోని థియేటర్లలో ఇప్పుడున్న 120-150 ధరలను రూ.200కు పెంచి పండుగ వేళ క్యాష్ చేసుకోవాలని చిత్ర బృందాలు రెడీ అయ్యాయి.

మరో వైపు ఆంధ్రప్రదేశ్ లో అయితే ఏకంగా ఈ ధరలనురూ.250కు పెంచాలని పంపిణీ దారులకు ఆదేశాలు వచ్చాయని తెలిసింది. దీని వల్ల రెండు పెద్ద హీరోల సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వచ్చి లాభాల పంట పండుతుందని తెలుస్తోంది. రెండు పెద్ద హీరోల సినిమాలు కావడంతో మొదటి వారంలోనే భారీగా ఆదాయం పొంది క్యాష్ చేసుకోవాలని డిస్ట్రిబ్యూటర్స్ రెడీ అయినట్లు తెలిసింది.

First Published:  6 Jan 2020 3:22 AM GMT
Next Story