Telugu Global
Cinema & Entertainment

సరిలేరు నీకెవ్వరు ట్రయిలర్ రివ్యూ

అనీల్ రావిపూడి కామెడీ ఎలా ఉంటుందో తెలిసిందే. ఇక మహేష్ బాబు మేనరిజమ్స్, యాక్టింగ్ గురించి కూడా తెలిసిందే. ఈ రెండు మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో సరిలేరు నీకెవ్వరు సినిమా అలా ఉండబోతోంది. రాత్రి విడుదలైన ట్రయిలర్ చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. సూపర్ స్టార్ దొరికాడని అనీల్ తన ట్రాక్ మార్చలేదు. అనీల్ దొరికాడని మహేష్ తన మేనరిజమ్స్ మిస్ అవ్వలేదు. ఇద్దరు తమ పని తాము చేసుకుపోయారు. వీళ్లకు రష్మిక, విజయశాంతి, […]

సరిలేరు నీకెవ్వరు ట్రయిలర్ రివ్యూ
X

అనీల్ రావిపూడి కామెడీ ఎలా ఉంటుందో తెలిసిందే. ఇక మహేష్ బాబు మేనరిజమ్స్, యాక్టింగ్ గురించి కూడా తెలిసిందే. ఈ రెండు మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో సరిలేరు నీకెవ్వరు సినిమా అలా ఉండబోతోంది. రాత్రి విడుదలైన ట్రయిలర్ చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది.

సూపర్ స్టార్ దొరికాడని అనీల్ తన ట్రాక్ మార్చలేదు. అనీల్ దొరికాడని మహేష్ తన మేనరిజమ్స్ మిస్ అవ్వలేదు. ఇద్దరు తమ పని తాము చేసుకుపోయారు. వీళ్లకు రష్మిక, విజయశాంతి, బండ్ల గణేశ్, ప్రకాష్ రాజ్ నుంచి పూర్తి సహకారం దొరికింది. తన ప్రతి సినిమాలో ఏదో ఒక డైలాగ్ తో కామెడీ క్రియేట్ చేసే అనీల్ రావిపూడి, ఈ సినిమాలో కూడా రష్మికకు అలాంటి డైలాగ్ ఇచ్చాడు.

ఈ సంక్రాంతికి సిసలైన సినిమా ఇదే అనే ఫీల్ అండ్ లుక్ ఇచ్చేలా ట్రయిలర్ కటింగ్ లో అనీల్ రావిపూడి చాలా జాగ్రత్తలు తీసుకున్న విషయం అర్థమౌతోంది. కామెడీ, యాక్షన్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి కొట్టాడు. చివర్లో లుంగీలో మహేష్ ను చూపించి సినిమాలో ఇంకా చాలా ఉందనే ఫీల్ తీసుకొచ్చాడు.

అయితే ట్రయిలర్ ఆసాంతం కొత్తగా ఉందని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ట్రయిలర్ లో అనీల్ రావిపూడి చూపించిన కామెడీ షాట్స్, కామెడీ మేనరిజమ్స్ ఆల్రెడీ ఎఫ్2లో చూసినట్టే అనిపించింది. ఇక మహేష్ కు సంబంధించి యాక్షన్ లుక్స్ లో కూడా కొత్తదనం లేదు. ఉన్నంతలో కొత్తగా కనిపిస్తోంది మహేష్-విజయశాంతి కాంబినేషన్ మాత్రమే. ఈ కాంబినేషన్ క్లిక్ అయితే సంక్రాంతి సినిమా ఇదే అవుతుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

First Published:  5 Jan 2020 11:12 PM GMT
Next Story