Telugu Global
NEWS

టాప్స్ అథ్లెట్లకు కోటీ 60 లక్షల సాయం

టోక్యో ఒలింపిక్స్ సన్నాహాలకు గ్రాంట్లు ప్రపంచ ప్రఖ్యాత భారత అథ్లెట్లకు వివిధ రూపాలలో ఆర్థికసాయం అందచేయటానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన …టువర్డ్స్ ఒలింపిక్ పోడియం స్కీమ్‌ ( టాప్స్ ) కింద కేంద్ర క్రీడామంత్రిత్వశాఖ కోటీ 60 లక్షల రూపాయల నిధులు విడుదల చేసింది. ఈ పథకం కింద తెలుగుతేజం కిడాంబీ శ్రీకాంత్, జావలిన్ త్రో ప్రపంచ జూనియర్ చాంపియన్ నీరజ్ చోప్రా, కుస్తీలో భారత ఆశాకిరణం భజరంగ్ పూనియాతో సహా పలువురు క్రీడాకారులు నెలకు 50 వేల రూపాయలు […]

టాప్స్ అథ్లెట్లకు కోటీ 60 లక్షల సాయం
X
  • టోక్యో ఒలింపిక్స్ సన్నాహాలకు గ్రాంట్లు

ప్రపంచ ప్రఖ్యాత భారత అథ్లెట్లకు వివిధ రూపాలలో ఆర్థికసాయం అందచేయటానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన …టువర్డ్స్ ఒలింపిక్ పోడియం స్కీమ్‌ ( టాప్స్ ) కింద కేంద్ర క్రీడామంత్రిత్వశాఖ కోటీ 60 లక్షల రూపాయల నిధులు విడుదల చేసింది.

ఈ పథకం కింద తెలుగుతేజం కిడాంబీ శ్రీకాంత్, జావలిన్ త్రో ప్రపంచ జూనియర్ చాంపియన్ నీరజ్ చోప్రా, కుస్తీలో భారత ఆశాకిరణం భజరంగ్ పూనియాతో సహా పలువురు క్రీడాకారులు నెలకు 50 వేల రూపాయలు సాయం పొందనున్నారు. దీనికితోడు… క్రీడాపరికరాలు, విదేశీ శిక్షణకు సైతం ప్రభుత్వం చేయూత నివ్వనుంది.

2020 ఒలింపిక్స్ తో పాటు..2024, 2028 ఒలింపిక్స్ కు సైతం అథ్లెట్లను సిద్ధం చేయటం కోసం కేంద్ర క్రీడామంత్రిత్వశాఖ భారీగా నిధులు ఖర్చు చేస్తోంది.

టాప్స్ కోసం దరఖాస్తు చేసుకొన్న విఖ్యాత అథ్లెట్లలో లాంగ్ జంపర్ శ్రీశంకర్ మురళీ, ట్రిపుల్ జంపర్ అర్పిందర్ సింగ్, ఆర్చర్లు బాంబ్యేలా దేవి, దీపిక కుమారి, అంకిత బకాట్, టీటీ స్టార్లు శరత్ కమల్, మోనికా బాత్రా, సత్యన్, మానవ ఠక్కర్, హర్మీత్ దేశాయ్, షట్లర్లు ప్రణయ్, సాయి ప్రణీత్, సమీర్ వర్మ, కిడాంబీ శ్రీకాంత్, సైక్లిస్ట్ ఎసో అల్బెన్ సైతం ఉన్నారు.

వివిధ అంతర్జాతీయ పోటీలలో పాల్గొనటానికి అవసరమైన నిధులను బ్యాడ్మింటన్ ప్లేయర్లకు మంజూరు చేసింది.

First Published:  7 Jan 2020 12:52 AM GMT
Next Story