Telugu Global
Cinema & Entertainment

కొరటాలకు డెడ్ లైన్ విధించిన చిరంజీవి

మీడియా సమక్షంలో వ్యక్తుల్ని ఇరికించాలంటే నాగార్జున తర్వాతే ఎవరైనా. మరో సినిమాకు కమిట్ చేయాలన్నా, ఏదైనా ఫ్లాప్ ను డైరక్టర్ పై నెట్టేయాలన్నా అది నాగార్జునకే సొంతం. స్మూత్ గా మాట్లాడుతూ, అందంగా నవ్వుతూ చెప్పాల్సిన విషయం కాస్తా చెప్పేస్తుంటాడు ఈ హీరో. ఇప్పుడీ బాటలోకి చిరంజీవి కూడా వచ్చినట్టు కనిపిస్తోంది. నవ్వుతూనే, కొరటాల శివకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు మెగాస్టార్. సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడుతూ.. తక్కువ రోజుల్లో సినిమాను పూర్తిచేయడం […]

కొరటాలకు డెడ్ లైన్ విధించిన చిరంజీవి
X

మీడియా సమక్షంలో వ్యక్తుల్ని ఇరికించాలంటే నాగార్జున తర్వాతే ఎవరైనా. మరో సినిమాకు కమిట్ చేయాలన్నా, ఏదైనా ఫ్లాప్ ను డైరక్టర్ పై నెట్టేయాలన్నా అది నాగార్జునకే సొంతం. స్మూత్ గా మాట్లాడుతూ, అందంగా నవ్వుతూ చెప్పాల్సిన విషయం కాస్తా చెప్పేస్తుంటాడు ఈ హీరో. ఇప్పుడీ బాటలోకి చిరంజీవి కూడా వచ్చినట్టు కనిపిస్తోంది. నవ్వుతూనే, కొరటాల శివకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు మెగాస్టార్.

సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడుతూ.. తక్కువ రోజుల్లో సినిమాను పూర్తిచేయడం అత్యవసరం అన్నారు మెగాస్టార్. తక్కువ రోజుల్లో సినిమా పూర్తయితే నిర్మాతకు ఎక్కువ లాభం ఉంటుందన్నారు. ఇలా ఫ్లోలో మాట్లాడుతూనే.. తన సినిమాను కూడా 100 రోజుల్లోపే పూర్తిచేస్తానని కొరటాల మాటిచ్చాడంటూ చెప్పి లాక్ చేశారు చిరంజీవి.

దీంతో కొరటాలకు రియాక్ట్ అవ్వడానికి టైమ్ లేదు. తలూపడం మాత్రం చేయగలిగాడు. 80 నుంచి 99 రోజుల్లో సినిమాను పూర్తిచేయాలనేది చిరంజీవి డెడ్ లైన్. అంటే.. ఆఖరి తేదీ మార్చి 30. ఆ తేదీ లోపు చిరంజీవితో సినిమాను కొరటాల పూర్తిచేయాల్సి ఉంటుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ..

First Published:  6 Jan 2020 7:02 PM GMT
Next Story