Telugu Global
NEWS

అందరివాడు అనిపించుకోవాలని అన్నయ్య ఆరాటమా?

టాలీవుడ్ పెద్దలు…ఈ మాట మనకు అప్పుడప్పుడూ వినిపిస్తుంది… కనిపిస్తుంది. పెద్ద సినిమాలు ఒకే సారి రిలీజ్ అయినప్పుడో… లేకపోతే ఇండస్ట్రీలో ఇద్దరి మధ్య గొడవలు జరిగినప్పుడో ఈ పెద్దలూ… అన్న మాట మనకు వినిపిస్తుంటుంది. ఇంతకూ ఇప్పుడు టాలీవుడ్లో పెద్దలు ఎవరు…దాసరి నారాయణ రావు లేడు…నాగేశ్వరరావు లేరు…ఉన్నవాళ్లు తమ తమ బిజీలో ఉంటారు తప్ప అంతగా పెద్ద..అనిపించుకునే తరహా వారికి లేదు…అటు తిరిగి..ఎటు తిరిగినా..ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఒకే ఒక పెద్ద కాంపౌండ్ ..మెగా కాంపౌండ్.. ఇప్పుడు […]

అందరివాడు అనిపించుకోవాలని అన్నయ్య ఆరాటమా?
X

టాలీవుడ్ పెద్దలు…ఈ మాట మనకు అప్పుడప్పుడూ వినిపిస్తుంది… కనిపిస్తుంది. పెద్ద సినిమాలు ఒకే సారి రిలీజ్ అయినప్పుడో… లేకపోతే ఇండస్ట్రీలో ఇద్దరి మధ్య గొడవలు జరిగినప్పుడో ఈ పెద్దలూ… అన్న మాట మనకు వినిపిస్తుంటుంది.

ఇంతకూ ఇప్పుడు టాలీవుడ్లో పెద్దలు ఎవరు…దాసరి నారాయణ రావు లేడు…నాగేశ్వరరావు లేరు…ఉన్నవాళ్లు తమ తమ బిజీలో ఉంటారు తప్ప అంతగా పెద్ద..అనిపించుకునే తరహా వారికి లేదు…అటు తిరిగి..ఎటు తిరిగినా..ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఒకే ఒక పెద్ద కాంపౌండ్ ..మెగా కాంపౌండ్..

ఇప్పుడు ఆ కాంపౌడ్ కంట్రోల్ లోనే టాలీవుడ్ నడుస్తోందా..అంటే అవుననే చెప్పొచ్చు.. నిన్న మొన్నటిదాకా ఏ సమస్య వచ్చినా..ఇండస్ట్రీ మొత్తం దాసరి దగ్గరకు వెళ్లేవారు. కానీ ఆయనిప్పుడు లేరు. అందుకే ఇప్పుడు ఆ స్థాయి..అంతటి ఓర్పు నేర్పు..అందర్నీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చే స్టామినా ఉన్న ఒకే ఒక హీరో..చిరంజీవి అని టాలీవుడ్ భావిస్తోంది. అందుకే ఇంతవరకు ఆఫ్ లైన్ లోనే అడపా దడపా తీర్పులిచ్చే చిరంజీవి..ఇప్పుడు ఆన్ లైన్లోకి వచ్చేశారు. నా హీరో..ఆ హీరో…పక్క హీరో అన్న బేధం లేకుండా అందరి తలలో నాలుకలా మారిపోయారు. ఇది మా డైరీ సాక్షిగా…బయటపడ్డ నిజం…ఇక ముందు జరగబోయే వాస్తవం…

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఎప్పుడు ఎన్నికలు జరిగినా..మెగా కాంపౌండ్ మద్దతు లేనిదే ఆ అభ్యర్ధి విజయం సాధించడం దాదాపు అసాధ్యం..ఇది టాలీవుడ్ ఎరిగిన సత్యం. ఆ ఫ్యామిలీ ఎవరికి మద్దతు ఇస్తే వారికే విజయం. గత ఎన్నికల్లోనూ నరేష్ ప్యానెల్ కు మెగా…స్టార్స్ మద్దతు తెలపడంతో…ఈజీగా గెలిచింది. అందుకే చిరు కనుసన్నల్లోనే ఇప్పుడు టాలీవుడ్ నడుస్తోందన్నది అక్కడి నుంచి వినిపిస్తున్న మాట. ఇందుకు తగ్గట్టుగానే చిరంజీవి కూడా పెద్ద తరహా హోదా తీసుకునేందుకు సిద్ధమయ్యాడని తెలుస్తోంది. అందుకే మా డైరీ ఆవిష్కరణలో రాజశేఖర్ వ్యాఖ్యలపై మండిపడ్డ చిరు…కమిటీ వేసి చర్యలు తీసుకోవాలని బహిరంగంగానే మాను ఆదేశించాడు. చిరు ఆదేశించిన మరుక్షణమే ఓ కమిటీ కూడా ఫామ్ అయింది. ఆ కమిటీలో చిరంజీవి కూడా ఉన్నాడు. సో..ఇక నుంచి ఇండస్ట్రీలో ఎవరు ఎలాంటి తప్పు చేసినా…ఈ కమిటీ చర్యలు తీసుకుంటుందని సమాచారం.

ఈ ఒక్క విషయమే కాదు..ఇటీవల జరిగిన పరిణామాలు కూడా అలాగే కనిపిస్తున్నాయి. నిన్నటి నిన్న సంక్రాంతి సినిమాల విషయంలోనూ పెద్ద చర్చ జరిగినట్లు తెలుస్తోంది. చిరు జోక్యం చేసుకోకుంటే అది పెద్ద రచ్చ అయ్యేదని ఇండస్ట్రీ టాక్…ఒక రోజు వ్యవధిలో అల్లుఅర్జున్ అల..వైకుంఠపురంలో, మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలు రిలీజ్ కానున్నాయి. రెండు భారీ ప్రాజెక్టులు. ఓపెనింగ్స్ లో తేడా కొడితే భారీ నష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి. అందుకే రిలీజ్ విషయంలో రెండు సినిమా యూనిట్స్ మద్య వివాదం నడిచినట్లు సమాచారం.

ఈ రెండు సినిమాల్లో ఏదో ఒకటి వాయిదా పడుతుందన్న వాదన వినిపించింది..కానీ దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి మరీ సరిలేరు నీకెవ్వరు రిలీజ్ డేట్ లో మార్పు లేదని…జనవరి 11నే వస్తుందని ప్రకటించాడు. ఇంత ధైర్యంగా దిల్ రాజు ప్రకటించాడంటే..తెర వెనుక ఎంత తతంగం నడిచిందోనన్న టాక్ వినిపించింది. కానీ ఇదంతా మెగా కాంపౌండ్ నుంచే జరిగిందని ఫిలింనగర్ సమాచారం. రెండు సినిమాల రిలీజ్ విషయంలో కాంప్రమైజ్ చేసి…ఇద్దరి మధ్యా ఉన్న చిన్నపాటి ఇష్యూస్ ను చిరంజీవి పరిష్కరించాడని వినిపిస్తోంది. అంతేకాదు మహేష్ బాబు సినిమాకు స్పెషల్ గెస్ట్ గా కూడా హాజరై ..మేమంతా ఒక్కటే..అని చెప్పే ప్రయత్నం చేశారు చిరంజీవి.

సో..ఇక నుంచి టాలీవుడ్ పెద్దాయన చిరంజీవి.

First Published:  6 Jan 2020 8:36 PM GMT
Next Story