కల్యాణ్ రామ్ సినిమా కూడా రెడీ

సంక్రాంతి బరిలో నిలిచిన మహేష్, అల్లు అర్జున్ సినిమాలు సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తిచేసుకున్నాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి కల్యాణ్ రామ్ మూవీ కూడా చేరింది. ఎంత మంచివాడవురా సినిమా కూడా ఈ లాంఛనం పూర్తిచేసుకుంది. ఈరోజు సినిమాను చూసిన సెన్సార్ అధికారులు మూవీకి క్లీన్-U సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సంక్రాంతికి పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రం ఇదేననే విషయం సెన్సార్ సర్టిఫికేట్ చూస్తే అర్థమైపోతుంది.

ఇక సెన్సార్ టాక్ విషయానికొస్తే.. కల్యాణ్ రామ్, మెహ్రీన్ జంటగా నటించిన ఈ సినిమాలో ఫస్టాఫ్ యావరేజ్ గా ఉందట. సెకెండాఫ్ నుంచి సినిమా ఊపందుకుంటుందట. ఇక క్లైయిమాక్స్ సినిమాకు ఆయువుపట్టు అంటున్నారు. ఈ సెన్సార్ టాక్ ఎంత నిజమో తెలియాలంటే 15వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే.

సెన్సార్ పూర్తవ్వడమే ఆలస్యం అటు ఆన్ లైన్ బుకింగ్స్ తెరిచారు. ఇప్పటికే అల.., సరిలేవు.. సినిమాలకు ఆన్ లైన్ బుకింగ్స్ తెరవగా.. కొద్దిసేపటి కిందట ఎంత మంచివాడవురా సినిమా బుకింగ్స్ కూడా తెరుచుకున్నాయి. సతీష్ వేగేశ్న డైరక్ట్ చేసిన ఈ సినిమాను ఆదిత్య మ్యూజిక్ బ్యానర్ పై ఉమేష్ గుప్త నిర్మిస్తున్నాడు.