Telugu Global
NEWS

బాబు క్యాపిటలిస్ట్ ఉద్యమానికి కమ్యూనిస్ట్‌ల మద్దతా? ఇంత గబ్బు పట్టారేంటి రామకృష్ణ?

దేశంలోని తొలి క్యాపిటలిస్ట్ ఉద్యమం అమరావతిలో నడుస్తోందని… దాన్ని చంద్రబాబు నడిపిస్తున్నారని విమర్శించారు వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్. చంద్రబాబు చేస్తున్నపెట్టుబడిదారి ఉద్యమానికి సీపీఐ, సీపీఎం ఎలా మద్దతు ఇస్తున్నాయో ఆ పార్టీలు సమాధానం చెప్పాలన్నారు. కమ్యూనిస్టు సిద్ధాంతాలకు విరుద్ధంగా క్యాపిటలిస్ట్‌ ఉద్యమానికి మద్దతు ఇచ్చేలా ఎందుకు ఆ పార్టీలు గబ్బు పట్టిపోయాయో సీపీఐ రామకృష్ణ లాంటి వారు సమాధానం చెప్పాలన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రజలు నీళ్ల కోసం అల్లాడిపోతుంటే… చంద్రబాబు మాత్రం నీటి కోసం […]

బాబు క్యాపిటలిస్ట్ ఉద్యమానికి కమ్యూనిస్ట్‌ల మద్దతా? ఇంత గబ్బు పట్టారేంటి రామకృష్ణ?
X

దేశంలోని తొలి క్యాపిటలిస్ట్ ఉద్యమం అమరావతిలో నడుస్తోందని… దాన్ని చంద్రబాబు నడిపిస్తున్నారని విమర్శించారు వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్. చంద్రబాబు చేస్తున్నపెట్టుబడిదారి ఉద్యమానికి సీపీఐ, సీపీఎం ఎలా మద్దతు ఇస్తున్నాయో ఆ పార్టీలు సమాధానం చెప్పాలన్నారు.

కమ్యూనిస్టు సిద్ధాంతాలకు విరుద్ధంగా క్యాపిటలిస్ట్‌ ఉద్యమానికి మద్దతు ఇచ్చేలా ఎందుకు ఆ పార్టీలు గబ్బు పట్టిపోయాయో సీపీఐ రామకృష్ణ లాంటి వారు సమాధానం చెప్పాలన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రజలు నీళ్ల కోసం అల్లాడిపోతుంటే… చంద్రబాబు మాత్రం నీటి కోసం కాకుండా అమరావతి రేటు కోసం ఉద్యమం చేస్తున్నారని అమర్నాథ్ విమర్శించారు.

నీటి కోసం, ఉద్యోగాల కోసం ఉద్యమాలు చేయడం చూశాం… కానీ తొలి సారి తమ భూములకు రేటు కావాలంటూ ఉద్యమం చేస్తున్న ఏకైకనాయకుడు చంద్రబాబు మాత్రమేనని గుడివాడ అమర్నాథ్‌ ఫైర్ అయ్యారు.

విశాఖకు రాజధాని వస్తుంటే తట్టుకోలేక ఈనాడు పత్రిక ‘దూరభారం’ అంటూ విషం కక్కుతోందని మండిపడ్డారు. విశాఖ మీద ఈనాడు పత్రికకు ఎంత కడుపు మంట ఉందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చన్నారు. హైదరాబాద్, చెన్నై, కర్నూలు రాజధానులుగా ఉన్నప్పుడు ఏనాడైనా ఉత్తరాంధ్ర ప్రజలు దూరమవుతుంది కాబట్టి ఆ రాజధానులు వద్దని ఉద్యమం చేశారా అని ప్రశ్నించారు.

దేశ రాజధాని ఢిల్లీ దూరంగా ఉంది కాబట్టి రాజధాని మార్చాలని ఎప్పుడైనా డిమాండ్ చేశారా అని నిలదీశారు. అన్ని సౌకర్యాలున్న విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తే రాష్ట్రంపై భారం తగ్గుతుందన్న ఉద్దేశంతో నిర్ణయాలు తీసుకుంటే చంద్రబాబు, ఆయన మీడియా ఎందుకు తట్టుకోలేకపోతోందని నిలదీశారు.

ఉత్తరాంధ్ర ప్రాంతం చాలా కాలం టీడీపీకి అండగా ఉంటూ వచ్చిందని… అలాంటి ప్రాంతానికే చంద్రబాబు ఇప్పుడు వెన్నుపోటు పొడుస్తున్నారని విమర్శించారు. విశాఖకు పోవాలంటే మూడు రోజులు పడుతుందంటూ తప్పుడు వార్తలు ఈనాడు రాసిందని… టీడీపీ నేతలు ఏమైనా విశాఖకు నడుచుకుంటూ, పాకుకుంటూ వస్తున్నారా అని ప్రశ్నించారు.

లోకేష్‌ తన తండ్రి చంద్రబాబు జాతీయ నాయకుడు అని చెప్పుకునే వారని… ఇప్పుడు మాత్రం జాతీయ నాయకుడిగా కాకుండా జాతి నాయకుడి గా మారిపోయారని… రాష్ట్ర స్థాయినుంచి 29 గ్రామాల నాయకుడిగా మారిపోయారన్నారు.

అమరావతి ఉద్యమానికి మహిళలు తాళిబొట్లు, నగలు, కాళ్లమెట్టెలు ఇవ్వాలని చంద్రబాబు చెబుతున్నారని… అమరావతిలోని టీడీపీ నేతల భూములకు రేట్లు పెరగడం కోసం రాష్ట్రంలోని మహిళలు తాళిబొట్లు, కాళ్లమెట్టెలు ఇవ్వాలా?… ఇంతగా చంద్రబాబు ఎందుకు దిగజారిపోతున్నారని ప్రశ్నించారు.

గాంధీ చేసిన ఉద్యమంతో అమరావతి ఉద్యమాన్ని చంద్రబాబు పోల్చడం ఆశ్చర్యంగా ఉందన్నారు. గాంధీ ఏనాడు ఆయన గ్రామం కోసమో, ఆయన భూముల కోసమో ఉద్యమం చేయలేదని… ప్రపంచానికి ఆదర్శంగా నిలిచేలా గాంధీ ఉద్యమం చేశారన్నారు. చంద్రబాబు మాత్రం సొంత భూములకు రేటు కోసం ఉద్యమం చేస్తూ… దాన్ని గాంధీ ఉద్యమంతో పోల్చడం విచిత్రంగా ఉందన్నారు.

అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతూ మూడు వేల మందిని అడిగితే 14 వందల మంది అమరావతిలో రాజధాని పెట్టమన్నారని చెప్పడానికి సిగ్గుండాలన్నారు. ఏముందని అమరావతిలో రాజధాని పెట్టాల్సిందిగా జనం చెబుతారని నిలదీశారు. అదేమైనా విశాఖపట్నమా అని వ్యాఖ్యానించారు.

అమరావతిలో భవనం కట్టాలంటే 110 అగుడులు పునాది తీయాల్సి ఉంటుందన్నారు. ఒక కిలో మీటర్ రోడ్డు వేయాలంటే 42 కోట్లు అమరావతిలో ఖర్చు అవుతుందన్నారు. అలాంటి చోట రాజధాని కడితే రాష్ట్రం ఏమైపోవాలన్నారు.

First Published:  7 Jan 2020 12:54 AM GMT
Next Story