‘సరిలేరు నీకెవ్వరు’…. ఈ సినిమాలకు కాపీనట !

మహేష్ బాబు  ‘సరిలేరు నీకెవ్వరు’ ట్రైలర్ కు మంచి స్పందనే వస్తోంది. యూట్యూబ్ ట్రెండింగ్ లో నిలిచి 10లక్షల వ్యూస్ కు చేరువైంది.

ట్రైలర్ చూస్తే మొదట కామెడీ టోన్ తోనే సినిమా సాగుతుందని అర్థమైంది. అయితే ఈ ట్రైలర్ చూసిన ప్రేక్షకులు, సినీ ప్రేమికులు ఈ మూవీ కథాంశంపై కామెంట్ చేస్తున్నారు. ఎన్టీఆర్, మోహన్ బాబు ల కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘మేజర్ చంద్రకాంత్ ’తో పోలికలు ఉన్నాయని అంటున్నారు.

ఎన్టీఆర్ పాత్ర వలె విజయశాంతి పాత్రను రూపొందించారని తెలుస్తోంది. ఇక మహేష్ బాబు సినిమా ‘అతడు’లోని కొన్ని యాంగిల్స్ కూడా సరిలేరులో కనిపించాయని అంటున్నారు.

దర్శకుడు అనిల్ రవిపూడి.. వాణిజ్య విలువలతోపాటు మంచి కామెడీ, యాక్షన్ ఫుల్ ప్యాకేజీలు ఉండేలా తీర్చిదిద్దడంలో ప్రసిద్ధి చెందాడు. కానీ ప్రజలు ఈ సమయంలో వినూత్నమైన కథలను ఆశిస్తున్నారు. అనిల్ రావిపూడి కనుక పాత కథలకు కొత్త ట్విస్ట్ ఇస్తాడు. తనదైన శైలిలో వినోదాన్ని జోడిస్తాడు.

అయితే తాజాగా ‘సరిలేరు’ ట్రైలర్ లో ‘మేజర్ చంద్రకాంత్’, అతడు మూవీ పోలికలు ఉన్నాయనే ట్రోల్స్ సోషల్ మీడియాలో ఎక్కువయ్యాయి. వాటిపై అనిల్ కానీ సినిమా యూనిట్ కానీ పట్టించుకోవడం లేదు.