Telugu Global
NEWS

30 నిముషాల ముందుగానే ఐపీఎల్ షో

మే 24న 2020 ఐపీఎల్ టైటిల్ ఫైట్ ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ లీగ్ ఐపీఎల్ 13వ సీజన్ పోటీలను ..గత 12 సీజన్లకు భిన్నంగా 30 నిముషాల ముందుగానే ప్రారంభించాలని ఐపీఎల్ బోర్డు నిర్ణయించింది. సాధారణంగా ఐపీఎల్ మ్యాచ్ లను ఫ్లడ్ లైట్ల వెలుగులో రాత్రి 8 గంటలకు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే వివిధ కారణాలను దృష్టిలో ఉంచుకొని రాత్రి 7 గంటల 30నిముషాలకే మ్యాచ్ లు మొదలుపెట్టాలని ని్ర్ణయించారు. ముంబై వాంఖెడీ స్టేడియం వేదికగా మార్చి […]

30 నిముషాల ముందుగానే ఐపీఎల్ షో
X
  • మే 24న 2020 ఐపీఎల్ టైటిల్ ఫైట్

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ లీగ్ ఐపీఎల్ 13వ సీజన్ పోటీలను ..గత 12 సీజన్లకు భిన్నంగా 30 నిముషాల ముందుగానే ప్రారంభించాలని ఐపీఎల్ బోర్డు నిర్ణయించింది.

సాధారణంగా ఐపీఎల్ మ్యాచ్ లను ఫ్లడ్ లైట్ల వెలుగులో రాత్రి 8 గంటలకు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే వివిధ కారణాలను దృష్టిలో ఉంచుకొని రాత్రి 7 గంటల 30నిముషాలకే మ్యాచ్ లు మొదలుపెట్టాలని ని్ర్ణయించారు.

ముంబై వాంఖెడీ స్టేడియం వేదికగా మార్చి 29న ప్రారంభమయ్యే ఐపీఎల్ 13వ సీజన్ ఫైనల్స్ ను మే 24న నిర్వహించడానికి నిర్వహకసంఘం ఏర్పాట్లు చేసింది.

మొత్తం 57 రోజులపాటు జరిగే లీగ్ లో భాగంగా 2020 సీజన్లో డబుల్ హెడర్ మ్యాచ్ లు నిర్వహించరాదని నిర్ణయించారు.

టీఆర్పీ రేటింగ్ ను దృష్టిలో ఉంచుకొని ..రోజుకు రెండుమ్యాచ్ లకు బదులుగా ఒక్కో మ్యాచ్ నే నిర్ణీత సమయం కంటే 30 నిముషాలు ముందుగానే నిర్ణయించేలా కార్యక్రమం రూపొందించారు.

First Published:  8 Jan 2020 12:14 AM GMT
Next Story