Telugu Global
Cinema & Entertainment

దర్బార్ పై కేసు.. హైకోర్టులో క్లియరెన్స్

సరిగ్గా విడుదలకు 48 గంటల ముందు దర్బార్ సినిమాపై కేసు పడింది. అయితే దీనిపై ఎలాంటి వాయిదాలకు పోకుండా వెంటనే మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో వివాదం సమసిపోయింది. టీ కప్పులో తుపానులా చెలరేగిన ఈ వివాదం కోలీవుడ్ లో ఓ చిన్న సైజు ప్రకంపన సృష్టించింది. ఇంతకీ మేటర్ ఏంటంటే.. దర్బార్ సినిమా విడుదలను ఆపేయాలంటూ మలేషియాకు చెందిన ఓ పంపిణీ సంస్థ హైకోర్టులో కేసు వేసింది. గతంలో 2.O రిలీజ్ టైమ్ లో లైకా […]

దర్బార్ పై కేసు.. హైకోర్టులో క్లియరెన్స్
X

సరిగ్గా విడుదలకు 48 గంటల ముందు దర్బార్ సినిమాపై కేసు పడింది. అయితే దీనిపై ఎలాంటి వాయిదాలకు పోకుండా వెంటనే మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో వివాదం సమసిపోయింది. టీ కప్పులో తుపానులా చెలరేగిన ఈ వివాదం కోలీవుడ్ లో ఓ చిన్న సైజు ప్రకంపన సృష్టించింది.

ఇంతకీ మేటర్ ఏంటంటే.. దర్బార్ సినిమా విడుదలను ఆపేయాలంటూ మలేషియాకు చెందిన ఓ పంపిణీ సంస్థ హైకోర్టులో కేసు వేసింది. గతంలో 2.O రిలీజ్ టైమ్ లో లైకా ప్రొడక్షన్స్ సంస్థ తమకు 23 కోట్ల రూపాయలు బకాయి ఉందని, అది క్లియర్ చేయకుండా దర్బార్ ను విడుదల చేయడానికి వీల్లేదంటూ కేసు వేసింది. దీనికి సంబంధించిన సాక్ష్యాలను కూడా కోర్టుకు సమర్పించింది.

అయితే దీనిపై లైకా ప్రొడక్షన్ కూడా కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. తమకు చెందిన సినిమాల్నిడీఎంవై క్రియేషన్స్ సంస్థ మలేషియాలో రిలీజ్ చేసిందని, ఆ లెక్కలతో ఈ అప్పు సర్దుబాటు అయిందని వాదించింది. అయితే లైకా వాదనతో కోర్టు అంగీకరించలేదు. అలాఅని సినిమా రిలీజ్ ను ఆపలేదు. ముందుగా పూచీకత్తు కింద 4 కోట్ల 90 లక్షల రూపాయల్ని డిపాజిట్ చేసి సినిమాను రిలీజ్ చేసుకోవాలని ఆదేశించింది. సివిల్ కోర్టులో వాదనలు ముగిసి, తీర్పు వచ్చిన తర్వాత తుది ఆదేశాలిస్తామని ప్రకటించింది. మొత్తమ్మీద దర్బార్ సినిమా మలేషియాలో విడుదలకు లైన్ క్లియర్ అయింది.

First Published:  8 Jan 2020 12:33 AM GMT
Next Story