Telugu Global
NEWS

బాబు ఉద్యమానికి రామకృష్ణ రథసారథ్యం

రాజధాని అమరావతిలోనే ఉండాలన్న వాదనకు భిన్నంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు వారి అభిప్రాయం చెబితే సీపీఐ వింటుందని చెప్పారు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. రాజధాని మాత్రం అమరావతిలోనే ఉండాలని తాము చెబుతామన్నారు. ఉత్తరాంధ్రకు వెళ్లినా, రాయలసీమకు వెళ్లినా తమ పార్టీ అమరావతికే అనుకూలమని స్పష్టం చేశారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలని తామూ కోరుకుంటామని… కానీ రాజధాని మాత్రం అమరావతిలోనే ఉండాలన్నారు. మచిలీపట్నంలో జేఏసీ సమావేశాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తే అది వారి మూర్ఖత్వమే […]

బాబు ఉద్యమానికి రామకృష్ణ రథసారథ్యం
X

రాజధాని అమరావతిలోనే ఉండాలన్న వాదనకు భిన్నంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు వారి అభిప్రాయం చెబితే సీపీఐ వింటుందని చెప్పారు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. రాజధాని మాత్రం అమరావతిలోనే ఉండాలని తాము చెబుతామన్నారు. ఉత్తరాంధ్రకు వెళ్లినా, రాయలసీమకు వెళ్లినా తమ పార్టీ అమరావతికే అనుకూలమని స్పష్టం చేశారు.

రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలని తామూ కోరుకుంటామని… కానీ రాజధాని మాత్రం అమరావతిలోనే ఉండాలన్నారు. మచిలీపట్నంలో జేఏసీ సమావేశాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తే అది వారి మూర్ఖత్వమే అవుతుందన్నారు. రాజధాని ఉద్యమంలో చంద్రబాబు తర్వాత అంతే పట్టుదలతో పోరాడుతున్న రామకృష్ణ.. మచిలీపట్నం వెళ్లకుండా చంద్రబాబును, తమను అడ్డుకుంటే ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరించారు.

ప్రతిపక్షాలను చూసి ప్రభుత్వం భయపడిపోతోందని… అందుకే బస్సు యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని రామకృష్ణ విమర్శించారు. సీపీఐ చంద్రబాబు ఉద్యమానికి గట్టిగా మద్దతుగా నిలుస్తున్నా… సీపీఎం మాత్రం నేరుగా ఉద్యమంలో చంద్రబాబుకు మద్దతు ఇవ్వడం లేదు. రియల్‌ ఎస్టేట్‌ ధరలు పడిపోతాయని జరుగుతున్న పెట్టుబడిదారి ఉద్యమానికి కమ్యూనిస్టులు మద్దతు తెలపడం ఏమిటని విమర్శలు వస్తుండడంతో సీపీఎం ఆచితూచీ వ్యవహరిస్తోంది. సీపీఐ రామకృష్ణ మాత్రం అమరావతి కోసం ఎంతకైనా సై అంటున్నారు. అమరావతి కోసం నిప్పు పుట్టించేందుకు కూడా సిద్ధమని ఇప్పటికే ఆయన ప్రకటించారు. ఒకవిధంగా చంద్రబాబు ఉద్యమానికి రామకృష్ణ రథసారథ్యం వహిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీపీఐ నారాయణ కూడా అమరావతి కోసం గట్టిగా పోరాడుతున్నారు.

First Published:  9 Jan 2020 12:20 AM GMT
Next Story