Telugu Global
NEWS

మళ్లీ కాకమ్మ కబుర్లు చెబుతున్న పవన్‌...

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపైనా జనసేన చేతులెత్తేసింది. పార్టీ పెట్టి ఇన్నేళ్లు గడిచిన తర్వాత కూడా పోటీకి కాకమ్మ కబుర్లు చెబుతోంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో గ్లాసు గుర్తుపై పార్టీ పరంగా పోటీ చేయడం లేదని ప్రకటించింది. ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆసక్తి ఉన్న కార్యకర్తలు ఇండిపెండెట్లుగా పోటీ చేయండి అని ఓ సలహా పడేసింది. పోటీ చేసే కార్యకర్తలకు పార్టీ మద్దతు ఉంటుందని ప్రకటించింది. గ్లాసు గుర్తే వాడుకోకుండా చేసిన తర్వాత […]

మళ్లీ కాకమ్మ కబుర్లు చెబుతున్న పవన్‌...
X

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపైనా జనసేన చేతులెత్తేసింది. పార్టీ పెట్టి ఇన్నేళ్లు గడిచిన తర్వాత కూడా పోటీకి కాకమ్మ కబుర్లు చెబుతోంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో గ్లాసు గుర్తుపై పార్టీ పరంగా పోటీ చేయడం లేదని ప్రకటించింది. ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆసక్తి ఉన్న కార్యకర్తలు ఇండిపెండెట్లుగా పోటీ చేయండి అని ఓ సలహా పడేసింది. పోటీ చేసే కార్యకర్తలకు పార్టీ మద్దతు ఉంటుందని ప్రకటించింది. గ్లాసు గుర్తే వాడుకోకుండా చేసిన తర్వాత ఇక కొత్తగా ఇచ్చే మద్దతేంటి అని సెటైర్లు పడుతున్నాయి.

ఎన్నికల్లో పోటీ నుంచి ఇలా కుంటిసాకులు చెప్పి తప్పించుకోవడం జనసేనకు కొత్తేమీ కాదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇలాగే వెనక్కు తగ్గింది. హఠాత్తుగా ముందస్తు ఎన్నికలు వచ్చాయి కాబట్టి తాము పోటీ చేయడం లేదని లేకుంటే కథ మరోలా ఉండేదన్నట్టు అప్పట్లో పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. రెండు రాష్ట్రాల్లో గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు, వివిధ ఎన్నికల్లో కూడా పోటీకి జనసేన దూరంగా ఉంటూ వచ్చింది.

మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల వరకు జనసేన నేరుగా బరిలో దిగిన ఎన్నికలే లేవు. తన అసలు బలం ఎక్కడ బయటపడుతుందో అన్న ఉద్దేశంతో పవన్ అనుసరించిన వ్యూహం ఇది. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లోనూ తెలంగాణలో అక్కడక్కడ అభ్యర్థులను నిలిపినా ఏమాత్రం ప్రభావం చూపలేదు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గుర్తుపై అభ్యర్థులను నిలిపినా అసలు రేసులోనే పార్టీ ఉండదన్న విషయం పవన్ కల్యాణ్‌కు తెలుసు. అందుకే పార్టీ గుర్తుపై అభ్యర్థులను బరిలోకి దింపి… వారు ఘోరంగా ఓడిపోతే మాటలు పార్టీ పడాల్సి వస్తుందని పవన్ కల్యాణ్ జాగ్రత్త పడి ఉండవచ్చు .

జనసేన అభిమానులు ఎక్కడైనా ఇండిపెండెంట్లుగా పోటీ చేసిన పక్షంలో వారుగెలిస్తే అది జనసేన మద్దతు వల్ల గెలిచారు అన్న ప్రచారం చేసుకోవచ్చు. ఓడిపోతే వారు ఇండిపెండెంట్లుగా ఓడిన వారే అవుతారు. పార్టీ గుర్తుపై పోటీ చేయకపోవడం వల్ల జనసేనకు కేవలం ఇన్ని ఓట్లు మాత్రమే వచ్చాయి అని ఎవరూ తక్కువ చేసే అవకాశం కూడా ఉండదు. అందుకే సింపుల్‌గా ఎప్పటిలాగే కొన్ని ప్రత్యేక కారణాలు అంటూ పవన్ కల్యాణ్ ఎన్నికలకు డుమ్మా కొట్టేశారు.

First Published:  8 Jan 2020 9:56 PM GMT
Next Story