Telugu Global
NEWS

దాడులు చేస్తే ప్రతిఘటన తప్పదు- పెద్దిరెడ్డి హెచ్చరిక

రాజధాని పేరుతో అనవసర రాద్దాంతం చేయడం చంద్రబాబు మానుకోవాలని సూచించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అమరావతి పేరుతో చంద్రబాబు అనవసరం రాద్దాంతం చేస్తున్నారని విమర్శించారు. కేవలం కొన్ని వందల కుటుంబాలకు లాభాన్ని చేకూర్చేందుకే చంద్రబాబు ఆరాటపడుతున్నారని … రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. 40 ఏళ్ల నుంచి రాయలసీమ ప్రజలు డిమాండ్ చేస్తున్న హైకోర్టు నేడు వస్తుంటే… దాన్ని అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వెనుకబడిన ఉత్తరాంధ్రలో పరిపాలన రాజధాని […]

దాడులు చేస్తే ప్రతిఘటన తప్పదు- పెద్దిరెడ్డి హెచ్చరిక
X

రాజధాని పేరుతో అనవసర రాద్దాంతం చేయడం చంద్రబాబు మానుకోవాలని సూచించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అమరావతి పేరుతో చంద్రబాబు అనవసరం రాద్దాంతం చేస్తున్నారని విమర్శించారు. కేవలం కొన్ని వందల కుటుంబాలకు లాభాన్ని చేకూర్చేందుకే చంద్రబాబు ఆరాటపడుతున్నారని … రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు.

40 ఏళ్ల నుంచి రాయలసీమ ప్రజలు డిమాండ్ చేస్తున్న హైకోర్టు నేడు వస్తుంటే… దాన్ని అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వెనుకబడిన ఉత్తరాంధ్రలో పరిపాలన రాజధాని పెడితే చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు.

కేవలం అమరావతిలో భూముల విలువ పడిపోతుందని… వాటిని అమ్ముకోవడం ఇబ్బంది అవుతుందనే చంద్రబాబు బాధ పడుతున్నారని విమర్శించారు. అమరావతి ప్రాంతంలో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలపైనా దాడులు చేయించారని.. చంద్రబాబు తీరు ఇలాగే ఉంటే ఆయన రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా వైసీపీ శ్రేణులు కూడా అడ్డుకోవాల్సి ఉంటుందని పెద్దిరెడ్డి హెచ్చరించారు. చంద్రబాబు వెంటనే పద్దతి మార్చుకోవాలన్నారు.

రాజధాని అంశాన్ని పక్కనపెట్టి రాష్ట్ర అభివృద్ధికి ముందుకు రావాలని కోరారు. టీడీపీ వారు దౌర్జన్యాలు చేస్తే మాత్రం అదే స్థాయిలో జవాబు చెప్పాల్సి ఉంటుందన్నారు. నవ రత్నాల్లో 8వ కార్యక్రమం అమ్మ ఒడి కూడా పూర్తవుతోందని… ఇక ఉగాది నాడు 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం ద్వారా మిగిలి ఉందని దాన్ని కూడా పూర్తి చేస్తామన్నారు.

First Published:  9 Jan 2020 2:08 AM GMT
Next Story