Telugu Global
NEWS

ఫుడ్ మెనూ వెల్లడించిన ముఖ్యమంత్రి జగన్‌

పేద పిల్లల భవిష్యత్తుకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. డబ్బులు లేక పిల్లలు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఉండకూడదని అందుకే అమ్మ ఒడిని తీసుకొచ్చామన్నారు. చిత్తూరులో అమ్మ ఒడి పథకాన్ని జగన్ ప్రారంభించారు. అమ్మ ఒడి కోసం వచ్చే ఏడాది నుంచి 75 శాతం హాజరు మాత్రం తప్పనిసరి చేస్తామన్నారు. ఈ ఏడాది మాత్రం 75 శాతం అటెండెన్స్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు చెప్పారు. అమ్మ ఒడి కింద […]

ఫుడ్ మెనూ వెల్లడించిన ముఖ్యమంత్రి జగన్‌
X

పేద పిల్లల భవిష్యత్తుకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. డబ్బులు లేక పిల్లలు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఉండకూడదని అందుకే అమ్మ ఒడిని తీసుకొచ్చామన్నారు. చిత్తూరులో అమ్మ ఒడి పథకాన్ని జగన్ ప్రారంభించారు.

అమ్మ ఒడి కోసం వచ్చే ఏడాది నుంచి 75 శాతం హాజరు మాత్రం తప్పనిసరి చేస్తామన్నారు. ఈ ఏడాది మాత్రం 75 శాతం అటెండెన్స్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు చెప్పారు. అమ్మ ఒడి కింద 6వేల 318 కోట్లు ఇస్తున్నట్టు చెప్పారు.

ఇంగ్లీష్‌ మీడియం విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని… ఇంగ్లీష్ అవసరమా కాదా అన్నది తల్లిదండ్రులే చెప్పాలన్నారు. ఇంగ్లీష్ అవసరం అని ఈనాడు పత్రికకు, చంద్రబాబుకు నాయుడికి, సినిమా యాక్టర్‌కు వినిపించేలా చెప్పాలని కోరారు. తెలుగు మీడియం పిల్లలు ఇంగ్లీష్‌లోకి మారినప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయని… కానీ వాటిని అధిగమించి ముందుకెళ్లాల్సిందేనన్నారు. పిల్లలకు ఇబ్బందులు ఎదురుకాకుండా టీచింగ్‌లో జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు.

భవిష్యత్తులో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేలా ఆంధ్రప్రదేశ్లోని పిల్లలను తయారు చేస్తామన్నారు. పత్రికాధిపతుల పిల్లలు, నేతల పిల్లలు, అధికారుల పిల్లలు, యాక్టర్ల పిల్లలు ఇంగ్లీష్‌లో చదువుకుంటుంటే పేద పిల్లలను మాత్రం తెలుగు మీడియంకు పరిమితం చేసి వారిని గాలికి వదిలేయాలా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.

పేద పిల్లలను గాలికి వదిలేయబోమని… ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం తెస్తామని… మధ్యాహ్న భోజనంలో మెనూ కూడా మరింత మెరుగుపరుస్తామన్నారు. రోజూ ఒకే ఆహారం పెట్టి పిల్లలను విసిగించకూడదని… అందుకే మెనూ మొత్తం మార్చేస్తున్నామన్నారు. మధ్నాహ్న భోజనంలో సోమవారం అన్నం, పప్పుచారు, ఎగ్ కర్రి, స్వీట్‌ ఇస్తామన్నారు. మంగళవారం పులిహోర, టమోటా పప్పు, కోడి గుడ్డు, … బుధవారం వెజ్ రైస్, ఆలూ కూర్మా, కోడి గుడ్డు, స్వీట్‌, … గురువారం కిచిడీ, టమోటా చట్లీ, కోడి గుడ్డు,… శుక్రవారం అన్నం, పప్పు, కోడి గుడ్డు, స్వీట్,… శనివారం అన్నం, సాంబారు, స్వీట్ పొంగల్‌ అందిస్తామన్నారు.

ప్రతి స్కూల్‌లో టాయిలెట్లు, మంచినీరు, ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్, క్వాలిటీ ఫర్నీచర్‌, ప్రహరీగోడ, ఇంగ్లీష్‌ ల్యాబ్ తప్పనిసరిగా ఉండేలా ప్రభుత్వం చేస్తుందన్నారు. స్కూళ్లు తెరిచే నాటికి ప్రభుత్వ పాఠశాల్లో చదివే ప్రతి విద్యార్థికి మూడు జతల యూనిఫాం, బూట్లు, పుస్తకాలు, బెల్ట్‌తో కూడిన కిట్‌ను ఒక స్కూల్‌ బ్యాగులో పెట్టి అందిస్తామన్నారు.

ప్రభుత్వ స్కూళ్ల కోసం ఇవన్నీ చేస్తున్నామని… కాబట్టి స్కూళ్లు బాగుండేలా చూసుకునేందుకు తల్లిదండ్రులు కూడా ముందుకు రావాలన్నారు. పేరెంట్స్‌ కమిటీల ద్వారా పాఠశాలపై దృష్టి పెట్టాలని కోరారు. అమ్మ ఒడి ద్వారా 15వేలు తీసుకుంటున్న తల్లిదండ్రులు పాఠశాలల్లో బాత్‌రూం నిర్వాహణకు వెయ్యి రూపాయల చొప్పున వెచ్చించాలని కోరారు.

ప్రభుత్వం మౌలిక సదుపాయలను ఏర్పాటు చేయగలుగుతుందని… కానీ వాటి నిర్వాహణ సమస్యగా ఉంటుందని… కాబట్టి పేరెంట్స్ కమిటీలు ఈ విషయంలో దృష్టి సారించి వాటి బాగోగులను పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి కోరారు.

First Published:  9 Jan 2020 3:10 AM GMT
Next Story