Telugu Global
National

కశ్మీర్‌లో ఆంక్షలపై సుప్రీం ఆగ్రహం...

కశ్మీర్‌లో ఆంక్షలపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. కశ్మీర్‌లో ఇంటర్‌నెట్‌ను అడ్డుకోవడాన్ని సుప్రీం కోర్టు తప్పుపట్టింది. తక్షణం అత్యవసర సేవలన్నింటికీ ఇంటర్నెట్‌ను అందించాలని ఆదేశించింది. ఇంటర్‌నెట్‌ కూడా భావ ప్రకటన స్వేచ్ఛలో భాగమేనని అభిప్రాయపడింది. మరీ అత్యవసరం అయినప్పుడు మాత్రమే ఇంటర్‌నెట్‌పై ఆంక్షలు ఉంచాలని వ్యాఖ్యానించింది. ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయంటూ ప్రజల హక్కులను కాలరాస్తారా అని జస్టిస్ ఎన్‌వీ రమణ ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వ వెబ్‌సైట్లను అనుమతించాలని ఆదేశించింది. ఈ బ్యాంకింగ్‌ సదుపాయాన్ని కల్పించాలని స్పస్టం […]

కశ్మీర్‌లో ఆంక్షలపై సుప్రీం ఆగ్రహం...
X

కశ్మీర్‌లో ఆంక్షలపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. కశ్మీర్‌లో ఇంటర్‌నెట్‌ను అడ్డుకోవడాన్ని సుప్రీం కోర్టు తప్పుపట్టింది. తక్షణం అత్యవసర సేవలన్నింటికీ ఇంటర్నెట్‌ను అందించాలని ఆదేశించింది. ఇంటర్‌నెట్‌ కూడా భావ ప్రకటన స్వేచ్ఛలో భాగమేనని అభిప్రాయపడింది.

మరీ అత్యవసరం అయినప్పుడు మాత్రమే ఇంటర్‌నెట్‌పై ఆంక్షలు ఉంచాలని వ్యాఖ్యానించింది. ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయంటూ ప్రజల హక్కులను కాలరాస్తారా అని జస్టిస్ ఎన్‌వీ రమణ ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది.

ప్రభుత్వ వెబ్‌సైట్లను అనుమతించాలని ఆదేశించింది. ఈ బ్యాంకింగ్‌ సదుపాయాన్ని కల్పించాలని స్పస్టం చేసింది. నిరవధికంగా ఇంటర్‌నెట్‌పై ఆంక్షలు విధించడం రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనం అభిప్రాయపడింది.

ప్రస్తుతం ఇంటర్‌నెట్‌ అవసరాన్ని తక్కువగా అంచనా వేయవద్దని ప్రభుత్వానికి సూచించింది. 144 సెక్షన్‌పైనా సమీక్ష నిర్వహించాలని ఆదేశించింది. కశ్మీర్‌పై ఇంటర్‌నెట్‌పై ఆంక్షలను సవాల్‌ చేస్తూ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్‌ వేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఈమేరకు తీర్పు చెప్పింది.

First Published:  10 Jan 2020 12:26 AM GMT
Next Story