Telugu Global
NEWS

బాబు డ్రామా కంపెనీ.. షోలను విస్తరిస్తోంది...13న ఆఖరి భేటీ

రాజధానిపై ఏర్పాటైన హైపవర్ కమిటీ నేడు మరోసారి సమావేశం అయింది. బీసీజీ, జీఎన్‌రావు నివేదికలతో పాటు శివరామకృష్ణన్ కమిటీ నివేదికపైనా చర్చించారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించాలని సమావేశంలో అభిప్రాయపడినట్టు మంత్రి పేర్ని నాని చెప్పారు. రాజధాని రైతుల ప్రయోజనాలను కాపాడుతామన్నారు. అభివృద్ధి 13 జిల్లాలకు అందాలని కేంద్రీకృతం అవడం వల్ల జరిగే నష్టం ఇప్పటికే ఒకసారి చవిచూశామని… కాబట్టి భావోధ్వేగాలకు అవకాశం లేకుండా పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం […]

బాబు డ్రామా కంపెనీ.. షోలను విస్తరిస్తోంది...13న ఆఖరి భేటీ
X

రాజధానిపై ఏర్పాటైన హైపవర్ కమిటీ నేడు మరోసారి సమావేశం అయింది. బీసీజీ, జీఎన్‌రావు నివేదికలతో పాటు శివరామకృష్ణన్ కమిటీ నివేదికపైనా చర్చించారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించాలని సమావేశంలో అభిప్రాయపడినట్టు మంత్రి పేర్ని నాని చెప్పారు. రాజధాని రైతుల ప్రయోజనాలను కాపాడుతామన్నారు.

అభివృద్ధి 13 జిల్లాలకు అందాలని కేంద్రీకృతం అవడం వల్ల జరిగే నష్టం ఇప్పటికే ఒకసారి చవిచూశామని… కాబట్టి భావోధ్వేగాలకు అవకాశం లేకుండా పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రతి జిల్లా వారికి అభివృద్ధిలో తమకూ భాగస్వామ్యం ఉందన్న భావన కలిగించాల్సిన అవసరం ఉందన్నారు. ఈనెల 13న మరోసారి హైపవర్ కమిటీ సమావేశం అయి తుది నిర్ణయానికి వస్తుందని చెప్పారు. కొందరు రాజకీయ నాయకులు పనిగట్టుకుని ప్రజలను రెచ్చగొట్టే పనిలో ఉన్నారని పేర్ని నాని విమర్శించారు.

చంద్రబాబు నెల నుంచి రాష్ట్రంలో డ్రామాలకు తెరలేపారని మరో మంత్రి కన్నబాబు విమర్శించారు. ఇప్పుడు ఆ డ్రామా కంపెనీ అమరావతి ప్రాంతంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా షో చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ప్రజల్లో అలజడి రేపి రాజకీయ లబ్ధి పొందాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారన్నారు. మొన్నటి ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత కూడా చంద్రబాబులో మార్పు రాలేదని మండిపడ్డారు.

జగన్ చేస్తున్న యజ్ఞాన్ని భగ్నం చేసేందుకు చంద్రబాబు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు సొంత సంపదను సృష్టించేందుకే అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దిగారని విమర్శించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ది చంద్రబాబుకు పట్టదా అని నిలదీశారు. అమరావతి గ్రామాల్లో మాట్లాడుతున్న మాటలనే ఉత్తరాంధ్ర, రాయలసీమకు వెళ్లే మాట్లాడే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని కన్నబాబు అని సవాల్ చేశారు.

ఇసుక, ఇంగ్లీష్ అయిపోయిందని.. ఇప్పుడు రాజధాని అంటూ ఉనికిని కాపాడుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కుమారుడి రాజకీయ జీవితం కోసం రాష్ట్రంలో అలజడి సృష్టించాలని చూస్తున్నారన్నారు. నిన్నటి వరకు అమరావతిలో ఉన్నవన్నీ తాత్కాలిక కట్టడాలని ప్రచారం చంద్రబాబు మీడియా ఇప్పుడు మరోలా కథనాలు రాయడం విచిత్రంగా ఉందన్నారు.

ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారన్న భ్రమ నుంచి టీడీపీ వారు బయటకు రావాలన్నారు. జోలి కట్టుకుని తిరిగేందుకు చంద్రబాబుకు సిగ్గులేదా అని ప్రశ్నించారు. ఇలా వసూలు చేసిన డబ్బుతో ఏం చేయబోతున్నారని నిలదీశారు. ఉద్యోగులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని… ఇదేమీ చంద్రబాబు ప్రభుత్వం కాదన్నారు. మూడు ప్రాంతాలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి ముందుకెళ్తున్నారన్నారు.

అమరావతికి ప్రస్తుత అంచనాలతో లక్షా 10వేలు కోట్లు కావాలని పూర్తయ్యే సరికి అది మూడు లక్షల కోట్లకు చేరుతుందన్నారు. మిగిలిన ప్రాంతాలన్నింటిని గాలికి వదిలేసి ఒకేచోట డబ్బు ఖర్చు చేయాలా అని కన్నబాబు నిలదీశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపితే ప్రభుత్వం అడ్డుకోదని… కానీ ఎమ్మెల్యేలపై, జర్నలిస్టులపై దాడులు చేస్తామంటే మాత్రం చూస్తూ ఊరుకోబోమన్నారు. నిన్నటి వరకు కమ్యూనిస్టులను తిట్టిన చంద్రబాబు ఇప్పుడు అదే కమ్యూనిస్ట్‌ నేతలను ముందు పెట్టుకుని ధర్నాలు చేస్తున్నారని కన్నబాబు ఎద్దేవా చేశారు.

First Published:  10 Jan 2020 4:22 AM GMT
Next Story