Telugu Global
NEWS

సీబీఐ నియామకాలపై విజయసాయిరెడ్డి లేఖ.. స్పందించిన షా...

ఏపీలో సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌గా చంద్రబాబు తన మనిషిని నియమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అమిత్ షాకు రాసిన లేఖలో విజయసాయిరెడ్డి ఆరోపించారు. గతంలో సీబీఐ డైరెక్టర్‌గా పనిచేసిన లక్ష్మీనారాయణ పూర్తిగా చంద్రబాబు కనుసన్నల్లో పనిచేస్తూ వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టారని లేఖలో వివరించారు. జగన్‌ కేసు దర్యాప్తు సమయంలో ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ద్వారా ఎప్పటికప్పుడు చంద్రబాబుతో లక్ష్మీనారాయణ టచ్లో ఉండేవారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు, లక్ష్మీనారాయణలు ల్యాండ్ లైన్‌ ద్వారా మాట్లాడుకునేవారని వివరించారు. లక్ష్మీనారాయణ చేసిన […]

సీబీఐ నియామకాలపై విజయసాయిరెడ్డి లేఖ.. స్పందించిన షా...
X

ఏపీలో సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌గా చంద్రబాబు తన మనిషిని నియమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అమిత్ షాకు రాసిన లేఖలో విజయసాయిరెడ్డి ఆరోపించారు. గతంలో సీబీఐ డైరెక్టర్‌గా పనిచేసిన లక్ష్మీనారాయణ పూర్తిగా చంద్రబాబు కనుసన్నల్లో పనిచేస్తూ వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టారని లేఖలో వివరించారు. జగన్‌ కేసు దర్యాప్తు సమయంలో ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ద్వారా ఎప్పటికప్పుడు చంద్రబాబుతో లక్ష్మీనారాయణ టచ్లో ఉండేవారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు, లక్ష్మీనారాయణలు ల్యాండ్ లైన్‌ ద్వారా మాట్లాడుకునేవారని వివరించారు. లక్ష్మీనారాయణ చేసిన రాజకీయాలు, తప్పుడు ప్రవర్తనపై సీబీఐలో అంతర్గత విచారణ సైతం జరిగిందని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు.

ఒక దశలో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమై ఆ తర్వాత చంద్రబాబు సూచన మేరకు జనసేన తరపున లక్ష్మీనారాయణ పోటీ చేశారని లేఖలో వివరించారు. ప్రస్తుతం సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న కృష్ణ కూడా తెలుగు రాష్ట్రానికి చెంది వ్యక్తి అని… కృష్ణ సైతం మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ అభిప్రాయాలతో ప్రభావితమై నిర్ణయాలు తీసుకుంటున్నారు.

త్వరలో కొత్త జాయింట్ డైరెక్టర్‌గా వచ్చేందుకు లక్ష్మీనారాయణకు సన్నిహితుడైన హెచ్ వెంకటేశ్ ప్రయత్నిస్తున్నారని విజయసాయిరెడ్డి వివరించారు. వెంకటేశ్‌ తనది ఆంధ్రప్రదేశ్‌ కాదు… కర్నాటక అని చెప్పుకుంటున్నారని… కానీ ఆయన తల్లిదండ్రులు ఏపీకి చెందిన వారేనని… అందులోనూ రాజకీయ నేతలతో సంబంధాలు కలిగి ఉన్నారని విజయసాయిరెడ్డి తన లేఖలో వివరించారు. ఏపీకి సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా రావాలనుకుంటున్న వెంకటేశ్‌తో… మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ఆర్థిక సంబంధాలు కూడా ఉన్నాయని విజయసాయిరెడ్డి తన లేఖలో వెల్లడించారు. లక్ష్మీనారాయణ జేడీగా ఉన్న సమయంలోవెంకటేశ్‌ ఎస్పీగా పనిచేశారని వివరించారు.

చంద్రబాబు తన మనుషులను సీబీఐలో పెట్టుకుని కేసుల నుంచి తప్పించుకునేందుకు, చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తున్నారని… టీడీపీ హయాంలో జరిగిన భారీ అవినీతి నేపథ్యంలో కేసుల నుంచి రక్షణ కోసం తన అధికారులను సీబీఐలో నియమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విజయసాయిరెడ్డి ఆరోపింఆచరు. కొంతకాలంగా హైదరాబాద్ సీబీఐ జేడీల నియామకాలు దురుద్దేశ పూర్వకంగా, రాజకీయ ప్రయోజనాల కోసం జరుగుతున్నాయని.. కాబట్టి మరోసారి అలాంటిది జరగకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను విజయసాయిరెడ్డి లేఖలో కోరారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందని, రాజకీయాలతో సంబంధం లేని అధికారిని హైదరాబాద్‌లో సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా నియమించాలని లేఖలో కోరారు.

ఈ లేఖకు స్పందించిన అమిత్ షా… విజయసాయిరెడ్డి వినతిపై తప్పనిసరిగా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖను ఆదేశించారు.

First Published:  11 Jan 2020 6:38 AM GMT
Next Story