Telugu Global
NEWS

ఫేక్‌ ఫోటోతో చలసాని ప్రచారం... పోలీసులపై నెటిజన్ల బూతులు

మేధావి చలసాని శ్రీనివాస్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. తప్పుడు ఫోటోలను ఫేస్‌బుక్‌లో పోస్టు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. చలసాని శ్రీనివాస్‌ పేరున ఉన్న పేజీలో ఒక మహిళను పోలీసులు బలవంతంగా లాక్కెత్తున్న ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం అమరావతిలో రాజధాని మహిళలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో … ఆ సందర్భంగానే మహిళపై పోలీసులు ఇలా అనుచితంగా ప్రవర్తించారేమో అని చాలా భావిస్తున్నారు. దాంతో పోలీసులపై తీవ్ర పదజాలంలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. కానీ […]

ఫేక్‌ ఫోటోతో చలసాని ప్రచారం... పోలీసులపై నెటిజన్ల బూతులు
X

మేధావి చలసాని శ్రీనివాస్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. తప్పుడు ఫోటోలను ఫేస్‌బుక్‌లో పోస్టు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. చలసాని శ్రీనివాస్‌ పేరున ఉన్న పేజీలో ఒక మహిళను పోలీసులు బలవంతంగా లాక్కెత్తున్న ఫోటోను షేర్ చేశారు.

ప్రస్తుతం అమరావతిలో రాజధాని మహిళలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో … ఆ సందర్భంగానే మహిళపై పోలీసులు ఇలా అనుచితంగా ప్రవర్తించారేమో అని చాలా భావిస్తున్నారు. దాంతో పోలీసులపై తీవ్ర పదజాలంలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

కానీ ఈ ఫోటో ఇప్పటిది కాదు. చంద్రబాబు హయాంలో జరిగిన దారుణమే ఇది. 2017లో ఆక్వా పార్క్‌కు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న సమయంలో మహిళలపై అప్పటి ప్రభుత్వం ఇలా పోలీసులను ప్రయోగించింది. ఆ ఫోటోను తలసాని ఇప్పుడు తెచ్చి షేర్ చేయడం ద్వారా అమరావతిలోనే ఇలాంటి దురాగతాలు జరుగుతున్నాయేమోనన్న భావన కలిగిస్తున్నారని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అసలు విషయం తెలియని నెటిజన్లు ఇప్పుడు ఏపీ పోలీసులపై నోరు పారేసుకుంటున్నారు.

జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దూషిస్తున్నారు. అయితే ఈ ఫోటో 2017లోనిది అని గుర్తించిన నెటిజన్లు మాత్రం భగ్గుమంటున్నారు. ఎప్పటిఫోటోలో తెచ్చి ఇప్పుడు షేర్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించడమేనా మేధావుల లక్షణం అని ప్రశ్నిస్తున్నారు.

First Published:  11 Jan 2020 10:24 PM GMT
Next Story