ఆడవారితో రాజకీయం వద్దు… బాబుకు మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్ట్రాంగ్ కౌంటర్

అమరావతి ఉద్యమంలో తొలి నుంచి కూడా చంద్రబాబు టీం…  మహిళలలే ముందు పెట్టింది.  మహిళలతో ఆందోళనలు చేయిస్తోంది. వారిని పోలీసులు ఏమైనా అంటే మహిళలపై దాడి అంటూ గగ్గోలుపెట్టాలన్నది చంద్రబాబు వ్యూహంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అమరావతిలో మహిళలను అణచివేస్తున్నారు,… పోలీసులు బంధిస్తున్నారంటూ చంద్రబాబు ట్విట్టర్‌లో ఫైర్ అయ్యారు.

ఈ ట్వీట్‌కు  జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ స్పందించారు. మహిళలను రాజకీయాల్లోకి లాగవద్దని హితవు పలికారు. మహిళా కమిషన్ బృందం ఇప్పటికే అక్కడే ఉందని ఆమె వివరించారు. అన్ని గమనిస్తున్నామని చెప్పారు. రాజధాని రాజకీయంలోకి మహిళలను లాగవద్దని ఆమె చంద్రబాబుకు హితవు పలికారు.