Telugu Global
Cinema & Entertainment

అల వైకుంఠపురములో మొదటి రోజు వసూళ్లు

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అల వైకుంఠపురం సినిమాకు మొదటి రోజు భారీ వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 25 కోట్ల 56 లక్షల రూపాయల షేర్ వచ్చింది. బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ నంబర్ ఇది. నిజానికి ఈ సినిమా వసూళ్లు ఇంకా ఎక్కువగా ఉండేవి. ఒక రోజు ముందు మహేష్ మూవీ సరిలేరు నీకెవ్వరు రావడంతో, థియేటర్లు దొరక్క వసూళ్లు తగ్గాయి. అయినప్పటికీ ఉదయం 4 గంటల నుంచే […]

అల వైకుంఠపురములో మొదటి రోజు వసూళ్లు
X

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అల వైకుంఠపురం సినిమాకు మొదటి రోజు భారీ వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 25 కోట్ల 56 లక్షల రూపాయల షేర్ వచ్చింది. బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ నంబర్ ఇది.

నిజానికి ఈ సినిమా వసూళ్లు ఇంకా ఎక్కువగా ఉండేవి. ఒక రోజు ముందు మహేష్ మూవీ సరిలేరు నీకెవ్వరు రావడంతో, థియేటర్లు దొరక్క వసూళ్లు తగ్గాయి. అయినప్పటికీ ఉదయం 4 గంటల నుంచే ఆటలు మొదలుపెట్టారు. 6 షోలు వేశారు. రేట్లు బాగా పెంచారు. అందుకే ఈ స్థాయిలో వసూళ్లు వచ్చాయి.

అటు ఓవర్సీస్ లో అల… వైకుంఠపురములో… సినిమా సూపర్ హిట్ అయింది. ప్రీమియర్స్ తోనే 8 లక్షల డాలర్లు ఆర్జించిన ఈ సినిమా తాజాగా 1.34 మిలియన్ డాలర్ల వసూళ్లతో దూసుకుపోతోంది. ఓవర్సీస్ లో కూడా బన్నీకి ఇదే బిగ్గెస్ట్. త్రివిక్రమ్ కూడా యాడ్ అవ్వడంతో బన్నీకి ఓవర్సీస్ లో మార్కెట్ పెరిగింది. ఏపీ, నైజాంలో ప్రాంతాల వారీగా ఈ సినిమాకు మొదటి రోజు వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి.

నైజాం – రూ. 6.01 కోట్లు
సీడెడ్ – రూ. 4.02 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 2.87 కోట్లు
ఈస్ట్ – రూ. 2.98 కోట్లు
వెస్ట్ – రూ. 2.41 కోట్లు
గుంటూరు – రూ. 3.41 కోట్లు
నెల్లూరు – రూ. 1.29 కోట్లు
కృష్ణా – రూ. 2.57 కోట్లు

First Published:  13 Jan 2020 10:00 AM GMT
Next Story