Telugu Global
NEWS

ఏటీపీ కప్ చాంప్ సెర్బియా

ఫైనల్లో స్పెయిన్ పై సెర్బియా గెలుపు నడాల్ కు జోకోవిచ్ చెక్ ప్రారంభ ఏటీపీ టీమ్ ప్రపంచకప్ టైటిల్ ను నొవాక్ జోకోవిచ్ నాయకత్వంలోని సెర్బియాజట్టు గెలుచుకొంది. గత పదిరోజులుగా ఆస్ట్ర్రేలియాలోని మూడు ప్రధానవేదికలుగా జరిగిన 24 దేశాల ఈ టోర్నీ టైటిల్ సమరంలో సెర్బియా 2-1తో స్పెయిన్ ను అధిగమించి టైటిల్ సొంతం చేసుకొంది. తొలిసింగిల్స్ లో స్పెయిన్ నెగ్గి 1-0 ఆధిక్యం సాధించగా …కీలక డబుల్స్ నెగ్గడం ద్వారా సెర్బియా 1-1తో సమఉజ్జీగా నిలిచింది. విజేతను […]

ఏటీపీ కప్ చాంప్ సెర్బియా
X
  • ఫైనల్లో స్పెయిన్ పై సెర్బియా గెలుపు
  • నడాల్ కు జోకోవిచ్ చెక్

ప్రారంభ ఏటీపీ టీమ్ ప్రపంచకప్ టైటిల్ ను నొవాక్ జోకోవిచ్ నాయకత్వంలోని సెర్బియాజట్టు గెలుచుకొంది. గత పదిరోజులుగా ఆస్ట్ర్రేలియాలోని మూడు ప్రధానవేదికలుగా జరిగిన 24 దేశాల ఈ టోర్నీ టైటిల్ సమరంలో సెర్బియా 2-1తో స్పెయిన్ ను అధిగమించి టైటిల్ సొంతం చేసుకొంది.

తొలిసింగిల్స్ లో స్పెయిన్ నెగ్గి 1-0 ఆధిక్యం సాధించగా …కీలక డబుల్స్ నెగ్గడం ద్వారా సెర్బియా 1-1తో సమఉజ్జీగా నిలిచింది.

విజేతను నిర్ణయించే కీలక సింగిల్స్ మ్యాచ్ లో సెర్బియా స్టార్ ప్లేయర్ నొవాక్ జోకోవిచ్ 6-2, 7-6తో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు నడాల్ ను ఓడించడం ద్వారా తన జట్టుకు ఏటీపీ కప్ తో పాటు 15 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ చెక్ ను ఖాయం చేశాడు. నడాల్ ప్రత్యర్థిగా జోకోవిచ్ 28-26 రికార్డుతో తన ఆధిక్యాన్ని మరోసారి చాటుకోగలిగాడు.

హార్డ్ కోర్ట్ వేదికగా ఆడిన 12 టోర్నీలలో సెర్బియాకు ఇది 9వ గెలుపు కావడం విశేషం. ఏటీపీ కప్ సింగిల్స్ లో జోకోవిచ్ ఆడిన ఆరుకు ఆరు సింగిల్స్ నెగ్గగా…. నడాల్ మాత్రం ఆరు సింగిల్స్ లో 4 విజయాలు, 2 పరాజయాల రికార్డుతో మిగిలాడు.

ప్రపంచ టెన్నిస్ లోని మొదటి 24 అత్యుత్తమజట్ల మధ్య సిడ్నీ, పెర్త్ , బ్రిస్బేన్ నగరాలువేదికలుగా ఈ టోర్నీని నిర్వహించారు.

First Published:  12 Jan 2020 10:54 PM GMT
Next Story