సరిలేరు నీకెవ్వరు మొదటి రోజు వసూళ్లు

మహేష్ హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ దుమ్ముదులిపింది. సంక్రాంతి బరిలో నిలిచిన క్రేజీ మూవీ కావడం, థియేటర్లు కూడా భారీగా దక్కడంతో ఈ సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి. తొలిరోజు ఏపీ, నైజాంలో ఈ సినిమాకు ఏకంగా 32 కోట్ల రూపాయల షేర్ వచ్చింది.

టాలీవుడ్ హిస్టరీలోనే ఆల్ టైమ్ టాప్-4 ఓపెనర్ గా నిలిచింది సరిలేరు నీకెవ్వరు సినిమా. దీనికితోడు ఏపీ, నైజాంలో పెంచిన టిక్కెట్ ధరలు ఈ సినిమాకు కలిసొచ్చాయి. ఫలితంగా మొదటి రోజే 40శాతం రికవరీ సాధించింది ఈ మూవీ. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి

నైజాం – రూ. 8.66 కోట్లు
సీడెడ్ -రూ. 3.70 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 4.10 కోట్లు
ఈస్ట్ – రూ. 3.35 కోట్లు
వెస్ట్ – రూ. 2.72 కోట్లు
గుంటూరు – రూ. 5.15 కోట్లు
కృష్ణా – రూ. 3.07 కోట్లు
నెల్లూరు – రూ. 1.27 కోట్లు