నా 20 ఏళ్ల కెరీర్ లో ఇదే ఫస్ట్ టైమ్

సరిలేకు నీకెవ్వరు సినిమాకు సంబంధించి ఓ మంచి అనుభూతిని ప్రేక్షకులతో పంచుకున్నాడు మహేష్ బాబు. తన 20 ఏళ్ల కెరీర్ లో ఇప్పటివరకు చూడని అద్భుతమైన రియాక్షన్ ను కేవలం ఒకే ఒక్క పాటతో అందుకున్నానని తెలిపాడు. అదే మైండ్ బ్లాక్ సాంగ్.

“నా సినిమా దేవిశ్రీ చేతిలో ఉందంటే నాకు చాలా హ్యాపీ. ప్రశాంతంగా ఉంటుంది. అతడు నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్తాడు. మైండ్ బ్లాక్ లాంటి పాటను కంపోజ్ చేసి, నాతో అందులో డాన్స్ చేయించడం నిజంగా పెద్ద విషయం. ఆ క్రెడిట్ దేవిశ్రీ, అనీల్ రావిపూడికే దక్కుతుంది. ఆ పాటకు వచ్చిన రియాక్షన్ చూసి నేను నమ్మలేకపోతున్నాను. సినిమా కంటే ఆ పాటకే ఎక్కువ రియాక్షన్ వచ్చింది. నాకు మాత్రం ఇదొక కొత్త అనుభవం. ఇంత రియాక్షన్ ను నా 20 ఏళ్ల కెరీర్ లో చూడలేదు.”

తన పిల్లలతో కలిసి మొదటి రోజు సినిమా చూశానని, మైండ్ బ్లాక్ సాంగ్ ను సితార, గౌతమ్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారని అన్నాడు మహేష్. ప్రస్తుతం సినిమాకు భారీగా వసూళ్లు వస్తున్నాయని, అంతా హ్యాపీగా ఉండాలని కోరుకున్నాడు. సరిలేరు నీకెవ్వరు సక్సెస్ మీట్ లో మహేష్ ఇలా మాట్లాడాడు.