పెద్దలు కుదిర్చిన ప్రేమ పెళ్లి ఇది?

నితిన్ పెళ్లి గురించి రూమర్లు రావడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. దాదాపు ఐదేళ్లుగా నితిన్ పెళ్లిపై పుకార్లు వస్తూనే ఉన్నాయి. అయితే ఈసారి అవి పుకార్లు కావు. అన్నీ నిజాలే. అవును.. 2020లో నితిన్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. ఏప్రిల్ 16న నితిన్ పెళ్లి జరగనుంది. ఈ విషయాలన్నీ కొన్ని రోజుల కిందటే బయటకొచ్చాయి. తాజాగా పెళ్లి కూతురు ఎవరనే విషయం కూడా వెలుగులోకి వచ్చింది.

షాలినీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు నితిన్. ఈమె లండన్ లో ఎంబీఏ చదివింది. ప్రస్తుతం అక్కడే ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా కొనసాగుతోంది. నితిన్ ది షాలినీది ఒకటే సామాజిక వర్గం. అమ్మాయి కూడా రెడ్డీస్ కావడం, తన స్థోమతకు తగ్గ సంబంధం కావడంతో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి కూడా ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు.

పెళ్లిని దుబాయ్ లో చేయాలని నిర్ణయించారు. అక్కడే 3 రోజుల పాటు పెళ్లి ప్రక్రియ పూర్తిచేస్తారు. కేవలం బంధువులు, పరిశ్రమకు చెందిన అత్యంత సన్నిహితులు మాత్రమే దుబాయ్ వెళ్తారు. మిగిలిన వాళ్లందరికీ హైదరాబాద్ లోనే గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటుచేశారు.

ఏప్రిల్ మొదటి వారానికి తన చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తిచేయాలని ఫిక్స్ అయ్యాడు నితిన్. భీష్మ సినిమాను ఇప్పటికే పూర్తిచేశాడు. మరోవైపు వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్న రంగే దే సినిమాను శరవేగంగా పూర్తిచేస్తున్నాడు. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో చేస్తున్న చదరంగం అనే సినిమాపై మాత్రం కాస్త అనుమానాలున్నాయి. పెళ్లి తర్వాత కనీసం 3 నెలలు గ్యాప్ తీసుకోవాలని భావిస్తున్నాడు ఈ హీరో.