Telugu Global
NEWS

భారత గడ్డపై అతిపెద్ద సంక్రాంతి వన్డే సిరీస్

ముంబైలో భారత్- ఆస్ట్ర్రేలియా సూపర్ ఫైట్ కొత్తసంవత్సరంలో అతిపెద్ద వన్డే సిరీస్ సమరానికి భారత గడ్డపై రంగం సిద్ధమయ్యింది. ముంబై వాంఖెడీ స్టేడియం వేదికగా మరికాసేపట్లో ప్రారంభమయ్యే తీన్మార్ వన్డే సిరీస్ లో ప్రపంచ రెండోర్యాంకర్ భారత్, 4వ ర్యాంకర్ ఆస్ట్ర్రేలియాజట్లు ఢీ అంటే ఢీ అంటున్నాయి. మూడుమ్యాచ్ ల ఈ సిరీస్ ను సంక్రాంతి సంరంభ సిరీస్ గా బీసీసీఐ నిర్వహిస్తోంది. గత ఏడాదికాలంగా వెస్టిండీస్, శ్రీలంక, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ లాంటి జట్లను అలవోకగా ఓడించడం ద్వారా ఏకపక్షంగా […]

భారత గడ్డపై అతిపెద్ద సంక్రాంతి వన్డే సిరీస్
X
  • ముంబైలో భారత్- ఆస్ట్ర్రేలియా సూపర్ ఫైట్

కొత్తసంవత్సరంలో అతిపెద్ద వన్డే సిరీస్ సమరానికి భారత గడ్డపై రంగం సిద్ధమయ్యింది. ముంబై వాంఖెడీ స్టేడియం వేదికగా మరికాసేపట్లో ప్రారంభమయ్యే తీన్మార్ వన్డే సిరీస్ లో ప్రపంచ రెండోర్యాంకర్ భారత్, 4వ ర్యాంకర్ ఆస్ట్ర్రేలియాజట్లు ఢీ అంటే ఢీ అంటున్నాయి.

మూడుమ్యాచ్ ల ఈ సిరీస్ ను సంక్రాంతి సంరంభ సిరీస్ గా బీసీసీఐ నిర్వహిస్తోంది. గత ఏడాదికాలంగా వెస్టిండీస్, శ్రీలంక, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ లాంటి జట్లను అలవోకగా ఓడించడం ద్వారా ఏకపక్షంగా సిరీస్ లు నెగ్గుతూ వచ్చిన విరాట్ సేన..2020 తొలివన్డే సిరీస్ లోనే కంగారూల రూపంలో గట్టిజట్టును ఢీ కొనబోతోంది.

2018 తర్వాత స్టీవ్ స్మిత్…

సూపర్ హిట్టర్ ఆరోన్ ఫించ్ నాయకత్వంలోని ఆస్ట్ర్రేలియా జట్టులో డేవిడ్ వార్నర్, మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, యువఆటగాళ్లు మార్నుస్ లాబ్ చేజ్, హ్యాండ్స్ కోంబ్, కోరే, డీ ఆర్క్ షార్ట్, హేజిల్ వుడ్, పాట్ కమిన్స్, మిషెల్ స్టార్క్, ఆడం జంపా, అగర్ లాంటి హేమా హేమీ ఆటగాళ్లున్నారు.

కంగారూ స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్..

2018 తర్వాత తొలిసారిగా తన పేవరెట్ వన్ డౌన్ స్థానంలో బ్యాటింగ్ కు దిగబోతున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలలో పటిష్టంగా, సమతూకంతో ఉన్న ఆస్ట్ర్రేలియాకు భారత్ ప్రత్యర్థిగా ఆడిన గత ఐదు వన్డేలలో 3-2 రికార్డు ఉండటం విశేషం.

ముగ్గురు ఓపెనర్లతో భారత్…

మరోవైపు భారతజట్టు అదనపు బ్యాట్స్ మన్ తో బరిలోకి దిగనుంది. సూపర్ ఫామ్ లో ఉన్న ముగ్గురు ఓపెనర్లు.. రోహిత్ శర్మ, రాహుల్, శిఖర్ ధావన్ లతోనే బరిలోకి దిగాలని భావిస్తోంది. విరాట్ కొహ్లీ వన్ డౌన్ కు బదులుగా రెండో డౌన్ లో బ్యాటింగ్ కు దిగే అవకాశాలున్నాయి.

రెండుజట్ల ఫేస్ టు ఫేస్ రికార్డులు చూస్తే…భారత్ ప్రత్యర్థిగా ఆస్ట్ర్రేలియాకు 77, కంగారూలు ప్రత్యర్థిగా భారత్ కు 50 విజయాలు ఉన్నాయి. 2013 తర్వాత ఈ రెండుజట్లూ తలపడిన సమయంలో భారత్ 29, ఆస్ట్ర్రేలియా 27 విజయాలు నమోదు చేశాయి. భారతగడ్డపై ఆడిన గత 15 వన్డేలలో కంగారూలకు 9, భారత్ కు 6 విజయాలు మాత్రమే ఉన్నాయి.

మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ లో 325కు పైగా స్కోరు సాధించిన జట్టుకే విజయావకాశాలు ఉంటాయి. గత ఆరేళ్ల కాలంలో ఈ రెండుజట్లు తలపడిన 28 వన్డేలలో 25సార్లు 300కు పైగా స్కోర్లు నమోదు కావడం చూస్తే..సరికొత్త సిరీస్ లోని ప్రస్తుత తొలివన్డేలో సైతం భారీస్కోర్లు నమోదు కావడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ సంక్రాంతి సమరంలోని తొలివన్డేలో నెగ్గినజట్టుకే సిరీస్ పై పట్టు సాధించే అవకాశాలుంటాయి. ముంబై వన్డేలో ఏ జట్టు తొలిదెబ్బ కొడుతుందన్నదే ఇక్కడి అసలు పాయింటు.

First Published:  14 Jan 2020 1:06 AM GMT
Next Story