తారక్ ను తమ్ముడు అని పిలవను

ఎన్టీఆర్-కల్యాణ్ రామ్ ఎంత చక్కగా కలిసిమెలిసి ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. కొన్నాళ్ల పాటు ఈ రెండు కుటుంబాలు కలవకపోయినా వీళ్లిద్దరి మధ్య మాత్రం బంధం మంచిగానే కొనసాగించింది. తమ బంధం అన్నదమ్ముల కంటే ఎక్కువ అంటున్నాడు కల్యాణ్ రామ్. అందుకే తారక్ ను తమ్ముడు అని పిలవనంటున్నాడు.

“ఎన్టీఆర్ నన్ను అన్న అని పిలుస్తాడు. కానీ నేను ఎన్టీఆర్ ను తమ్ముడు అని పిలవను. నాన్న అని పిలుస్తాను. నాన్నను తారక్ లో చూసుకుంటాను, నాన్న లేని లోటును తమ్ముడు తీరుస్తున్నాడు. నాన్నలోని ఎన్నో లక్షణాలు తమ్ముడిలో ఉన్నాయి.”

తారక్ తో మల్టీస్టారర్ చేసే అంశంపై కూడా కల్యాణ్ రామ్ రియాక్ట్ అయ్యాడు. తారక్ కు తనకు మధ్య మంచి అనుబంధం అందని, దాన్ని కమర్షియల్ చేయలేనని సూటిగా చెప్పుకొచ్చాడు.

మంచి కథ దొరికి, ఎన్టీఆర్ అడిగితే నటిస్తాను తప్ప.. తను మాత్రం తారక్ ను ఎప్పుడూ మల్టీస్టారర్ గురించి అడగనని క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటివరకు తమ మధ్య ఆ ప్రస్తావన కూడా రాలేదన్నాడు కల్యాణ్ రామ్.