Telugu Global
Cinema & Entertainment

ఆడియన్స్ తొలిసారి నా డాన్స్ చూశారు

సరిలేరు నీకెవ్వరు సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది రష్మిక. పైగా తను చేసిన డాన్స్ కు మంచి రెస్పాన్స్ రావడంతో మరింత ఆనందంగా ఉంది. ఫస్ట్ టైమ్ తెలుగు ప్రేక్షకులు తన డాన్స్ చూశారంటున్న రష్మిక.. అసలు తనకు డాన్స్ వచ్చా రాదా అనే సందేహం యూనిట్ లో కూడా ఉండేదని, యూనిట్ లో అందరి ముందు డాన్స్ చేసి ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది రష్మిక. “మైండ్‌ బ్లాక్‌ సాంగ్‌ షూటింగ్ రోజు ఈ అమ్మాయికి […]

ఆడియన్స్ తొలిసారి నా డాన్స్ చూశారు
X

సరిలేరు నీకెవ్వరు సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది రష్మిక. పైగా తను చేసిన డాన్స్ కు మంచి రెస్పాన్స్ రావడంతో మరింత ఆనందంగా ఉంది. ఫస్ట్ టైమ్ తెలుగు ప్రేక్షకులు తన డాన్స్ చూశారంటున్న రష్మిక.. అసలు తనకు డాన్స్ వచ్చా రాదా అనే సందేహం యూనిట్ లో కూడా ఉండేదని, యూనిట్ లో అందరి ముందు డాన్స్ చేసి ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది రష్మిక.

“మైండ్‌ బ్లాక్‌ సాంగ్‌ షూటింగ్ రోజు ఈ అమ్మాయికి డ్యాన్స్‌ వచ్చో, రాదో అనే సందేహం అందరికీ ఉంది. ఎందుకంటే ఇంతకుముందు నేను పెద్దగా డాన్స్ చేయలేదు. కానీ ఒక చిన్న డ్యాన్స్‌ బిట్‌ చేసి చూపించాను. అందరూ ఎగ్జైట్‌ అయ్యారు. అలా మహేశ్‌ గారితో డ్యాన్స్‌ చేయడం చాలా ఎంజాయ్‌ చేశాను. థియేటర్ లలో ఈ సాంగ్ కు వస్తున్న రెస్పాన్స్ చూసి నాకే ఆశ్చర్యంగా ఉంది.”

అలా తొలిసారి తెలుగు ప్రేక్షకులు తన డాన్స్ చూశారంటోంది రష్మిక. గీతగోవిందం, ఛలో, డియర్ కామ్రేడ్ లాంటి సినిమాల్లో స్టెప్పులు వేయాల్సిన అవసరం రాలేదని.. సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఏకంగా మాస్ సాంగ్ కు డాన్స్ చేసే అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చింది

First Published:  14 Jan 2020 6:22 AM GMT
Next Story