Telugu Global
Cinema & Entertainment

3 రోజుల్లో 50 కోట్లు

తెలుగు రాష్ట్రాల్లో మహేష్ మూవీ హవా కొనసాగుతోంది. సంక్రాంతి కానుకగా థియేటర్లలోకొచ్చిన ఈ సినిమా వరుసగా మూడో రోజు కూడా మంచి వసూళ్లు సాధించింది. విడుదలైన ఈ 3 రోజుల్లో ఈ సినిమాకు ఏకంగా 50 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. అలా 3 రోజుల్లోనే 50 కోట్ల మార్క్ అందుకొని సరికొత్త రికార్డు సృష్టించాడు మహేష్. అటు గుంటూరులో మహేష్ మేనియా కొనసాగుతోంది. 3 రోజుల్లో ఏకంగా కోటి రూపాయల షేర్ రావడం అందర్నీ ఆశ్చర్యానికి […]

3 రోజుల్లో 50 కోట్లు
X

తెలుగు రాష్ట్రాల్లో మహేష్ మూవీ హవా కొనసాగుతోంది. సంక్రాంతి కానుకగా థియేటర్లలోకొచ్చిన ఈ సినిమా వరుసగా మూడో రోజు కూడా మంచి వసూళ్లు సాధించింది. విడుదలైన ఈ 3 రోజుల్లో ఈ సినిమాకు ఏకంగా 50 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. అలా 3 రోజుల్లోనే 50 కోట్ల మార్క్ అందుకొని సరికొత్త రికార్డు సృష్టించాడు మహేష్.

అటు గుంటూరులో మహేష్ మేనియా కొనసాగుతోంది. 3 రోజుల్లో ఏకంగా కోటి రూపాయల షేర్ రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. బాహుబలి-2 తర్వాత అతి తక్కువ రోజుల్లో ఎక్కువ కలెక్షన్స్ సాధించిన సినిమాగా సరిలేరు నీకెవ్వరు నిలిచింది. ఇక నైజాంలో కూడా సరిలేరు నీకెవ్వరు హంగామా కొనసాగుతోంది. ఇది తను నిర్మించిన సినిమా కావడంతో.. దిల్ రాజు అత్యథిక థియేటర్లు కేటాయించాడు. అలా భారీ స్థాయిలో థియేటర్లు దక్కించుకున్న ఈ సినిమా నైజాంలో మరో 2 రోజుల్లో సరికొత్త రికార్డు సృష్టించే ఛాన్స్ ఉంది.

ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో 74 కోట్ల రూపాయలకు అమ్మారు. 3 రోజుల్లోనే ఇది 50 కోట్లు కలెక్ట్ చేసింది. సంక్రాంతి సీజన్ మరో 4 రోజుల వరకు ఉంటుంది. సో.. ఈ వీకెండ్ ముగిసేనాటికి సరిలేరు నీకెవ్వరు సినిమా బ్రేక్-ఈవెన్ అయిపోవడం ఖాయం. ఈ ఆదివారం లేదా వచ్చే వారం నుంచి ఈ సినిమా లాభాల బాట పట్టే అవకాశం ఉంది.

First Published:  14 Jan 2020 6:49 AM GMT
Next Story