Telugu Global
NEWS

జగన్ కొత్త చట్టం.. ఇక ఏపీ రాజధాని ఉండదట...

ఏపీకి 3 రాజధానుల ప్రతిపాదన చేసిన జగన్ ఇప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని విస్తరించడానికి రెడీ అవుతున్నారు. ఒక్క ప్రాంతానికి పరిమితం చేయకుండా ఒక కొత్త చట్టం తీసుకురాబోతున్నారు. ఏపీ అసెంబ్లీ ఈనెల 20న ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ సమావేశంలోనే ఏపీ రాజధానిపై నిర్ణయం ప్రకటించబోతోంది. సీఎం జగన్ ఈ అసెంబ్లీలోనే ‘ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ-ప్రాంతాల సమానాభివృద్ధి చట్టం 2020’ ను ప్రవేశపెట్టబోతున్నట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఈ చట్టం […]

జగన్ కొత్త చట్టం.. ఇక ఏపీ రాజధాని ఉండదట...
X

ఏపీకి 3 రాజధానుల ప్రతిపాదన చేసిన జగన్ ఇప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని విస్తరించడానికి రెడీ అవుతున్నారు. ఒక్క ప్రాంతానికి పరిమితం చేయకుండా ఒక కొత్త చట్టం తీసుకురాబోతున్నారు.

ఏపీ అసెంబ్లీ ఈనెల 20న ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ సమావేశంలోనే ఏపీ రాజధానిపై నిర్ణయం ప్రకటించబోతోంది. సీఎం జగన్ ఈ అసెంబ్లీలోనే ‘ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ-ప్రాంతాల సమానాభివృద్ధి చట్టం 2020’ ను ప్రవేశపెట్టబోతున్నట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఈ చట్టం ద్వారా అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు సమానంగా పంచనున్నారట.

ఈ కొత్త చట్టంలో రాష్ట్రాన్ని మూడు జోన్ లుగా సీఎం జగన్ విభజించబోతున్నారట. సీఎంతోపాటు 9మంది సభ్యులు కలిగిన ఒక బోర్డును ఏర్పాటు చేయబోతున్నారట. ఈ బోర్డు కిందకు ప్రతీ జోను వస్తుందని చట్టంలో పేర్కొన్నారట.

ఇక రాష్ట్రంలోని అన్ని అధికార కార్యాలయాలను, వేర్వేరు శాఖలను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం ద్వారా అన్ని ప్రాంతాల సమానాభివృద్ధిని సాధించడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశంగా జగన్ సర్కారు భావిస్తోందట.

విశాఖపట్నంను పరిపాలన రాజధానిగా చేసే ప్రతిపాదనను చట్టంలో పేర్కొనకుండా అభివృద్ధి వికేంద్రకరణ పేరిట కొత్త చట్టాన్ని జగన్ తెస్తున్నారట. మరి ఈ చట్టం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

First Published:  14 Jan 2020 6:38 AM GMT
Next Story