Telugu Global
NEWS

భారతీయ ‘జనసేన’ సమితి.... రేపే ముహూర్తం?

చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో కలిపేసిన షాక్ నుంచి చాలామంది ఇప్పటికీ కోలుకోలేదు. ఇప్పుడు అంతటి నిర్ణయం కాకున్నా.. ఆ పరిణామానికి దగ్గర్లో.. అన్నట్టుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ అడుగులు వేస్తున్నారు. రాజధాని కోసం అమరావతిలోని కొందరు రైతుల పోరాటం.. ఇటు మూడు రాజధానుల కోసం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రయత్నం… వీటి నడుమ రాష్ట్రం రాజకీయంగా రగులుతున్న వేళ.. దిల్లీ వెళ్లడం.. బీజేపీతో ‘అవగాహన’ కుదుర్చుకోవడం లాంటి పనులు చేస్తున్నారు జనసేన అధినేత పవన్ […]

భారతీయ ‘జనసేన’ సమితి.... రేపే ముహూర్తం?
X

చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో కలిపేసిన షాక్ నుంచి చాలామంది ఇప్పటికీ కోలుకోలేదు. ఇప్పుడు అంతటి నిర్ణయం కాకున్నా.. ఆ పరిణామానికి దగ్గర్లో.. అన్నట్టుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ అడుగులు వేస్తున్నారు. రాజధాని కోసం అమరావతిలోని కొందరు రైతుల పోరాటం.. ఇటు మూడు రాజధానుల కోసం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రయత్నం… వీటి నడుమ రాష్ట్రం రాజకీయంగా రగులుతున్న వేళ.. దిల్లీ వెళ్లడం.. బీజేపీతో ‘అవగాహన’ కుదుర్చుకోవడం లాంటి పనులు చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.

ఈ అడుగుల్లో భాగంగా.. పవన్ కల్యాణ్ తాను ఒంటరిగా ఏ పోరాటం చేయలేకపోతున్నారన్న విషయం స్పష్టమైపోతోంది. అలాగే… బీజేపీతో తాము కలిసి పని చేస్తామని చెప్పడం.. గతంలోనూ తాము బీజేపీకి దూరంగా లేము అని చెప్పడాన్ని.. ఓ సారి గుర్తు చేసుకోవాల్సి వస్తోంది. పవన్ సొంతంగా రాజకీయాలు చేయడం లేదన్న వాస్తవాన్ని అంతా అర్థం చేసుకోవాల్సి ఉంది.

ప్రస్తుతానికైతే.. ఆయనకు బీజేపీ నేతలు అండగా నిలుస్తున్న వైనాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. తర్వాత.. వారి కూటమిలో కలిసేందుకు.. వారితో కలిసి అడుగులు వేసేందుకు తెదేపా కూడా ఆరాటపడుతోంది. పైగా.. జనసేన, బీజేపీ అవగాహన రాజకీయాలకు ఓ ముహూర్తం కూడా ఖరారైంది. రేపే.. అంటే జనవరి 16న విజయవాడలో ఇరు పార్టీల ఉమ్మడి సమావేశం జరగనుంది. మరిన్ని వివరాలు, విశేషాలను ఆ భేటీ తర్వాతే చెబుతామని పవన్ చెప్పారు.

ఇక్కడ అవగాహన అంటే ఏంటన్నదే చర్చనీయాంశంగా మారింది. జనసేన ఇక భారతీయ జనసేన సమితిగా అడుగులు వేయబోతోందని.. ఆ రెండు పార్టీలు త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో కలిసి పని చేస్తాయని.. పొత్తులు కూడా ఖరారు చేసుకుంటాయని.. అమరావతి విషయంలో అంగీకారానికి వచ్చి.. ఉమ్మడి నిర్ణయాన్ని వెల్లడిస్తాయని… ఓ ప్రచారమైతే విపరీతంగా జరుగుతోంది.

ఈ ప్రచారంలో నిజమెంత.. అసలు పవన్ కల్యాణ్ అంతరంగమేంటి? ఈ అర్థం లేని రాజకీయాల వెనక అసలు ఆలోచనలేంటి? ఇందులో తెలుగుదేశం పాత్ర ఏంటి? ఈ ప్రశ్నలకు చాలావరకూ బీజేపీ, జనసేన సమావేశం తర్వాత మనకు సమాధానాలు దొరుకుతాయి.

First Published:  15 Jan 2020 1:31 AM GMT
Next Story