Telugu Global
Cinema & Entertainment

'ఎంత మంచివాడవురా!' సినిమా రివ్యూ

రివ్యూ : ఎంత మంచివాడవురా రేటింగ్ : 2/5 తారాగణం : కళ్యాణ్ రామ్, మెహరీన్, తనికెళ్ళ భరణి, శరత్ బాబు, సుహాసిని, విజయకుమార్, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల తదితరులు సంగీతం: గోపి సుందర్ నిర్మాత : ఉమేష్ గుప్త, సుభాష్ గుప్త దర్శకత్వం :  సతీష్ వేగేశ్న ‘118’ సినిమాతో మంచి హిట్ అందుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్ మొట్టమొదటిసారిగా ఒక పూర్తి ఫ్యామిలీ కథ చిత్రం అయిన ‘ఎంత మంచి వాడవురా’ సినిమాతో ప్రేక్షకుల […]

ఎంత మంచివాడవురా! సినిమా రివ్యూ
X

రివ్యూ : ఎంత మంచివాడవురా
రేటింగ్ : 2/5
తారాగణం : కళ్యాణ్ రామ్, మెహరీన్, తనికెళ్ళ భరణి, శరత్ బాబు, సుహాసిని, విజయకుమార్, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల తదితరులు
సంగీతం: గోపి సుందర్
నిర్మాత : ఉమేష్ గుప్త, సుభాష్ గుప్త
దర్శకత్వం : సతీష్ వేగేశ్న

‘118’ సినిమాతో మంచి హిట్ అందుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్ మొట్టమొదటిసారిగా ఒక పూర్తి ఫ్యామిలీ కథ చిత్రం అయిన ‘ఎంత మంచి వాడవురా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే ‘శతమానంభవతి’, ‘శ్రీనివాస కళ్యాణం’ వంటి చిత్రాలను ప్రేక్షకులకు అందించిన సతీష్ వేగేశ్న ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

‘ఎఫ్ 2’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మెహరీన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. సుహాసిని, శరత్ బాబు, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథ:

బాలు (కళ్యాణ్ రామ్) ఒక అనాధ. అతను తన తల్లిదండ్రులని చిన్నతనంలోనే పోగొట్టుకుంటాడు. అతని బంధువులు అతన్ని ఒంటరిగానే వదిలేస్తారు. అలాగే పెరిగిన బాలు ఎప్పటికైనా తిరిగి అన్ని బంధాలు ఏర్పరచుకోవాలని అనుకుంటూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే ఆల్ ఈజ్ వెల్ అనే ఒక ఆర్గనైజేషన్ స్థాపిస్తాడు.

ఆ ఆర్గనైజేషన్ అవసరంలో ఉన్న వాళ్ళకి చుట్టాలని మరియు బంధాలను బంధువులను సప్లై చేస్తూ ఉంటుంది. ఇలా ఒక కుటుంబానికి కొడుకుగా వెళ్లిన బాలు కష్టాల్లో ఉన్న కుటుంబానికి అండగా నిలవాలని అనుకుంటాడు. అసలు ఆ కుటుంబానికి ఎలాంటి కష్టాలు వచ్చాయి? ఆ కష్టాలని బాలు ఎలా తీర్చాడు? చివరికి ఏమైంది? వంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

నటీనటులు:

చాలా కాలం తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ ఒక పూర్తి ఫ్యామిలీ సినిమాలో నటించారు. ఈ సినిమాకి కళ్యాణ్ రామ్ నటన హైలైట్ గా నిలిచింది అని చెప్పుకోవచ్చు.

తన పాత్రకి నటన పరంగా అంత స్కోప్ లేకపోయినప్పటికీ ఉన్నంతలో మెహరిన్ పిర్జాద బాగానే నటించింది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ తో ఆమె కెమిస్ట్రీ పర్వాలేదు అనిపిస్తుంది.

తనికెళ్ళ భరణి నటన ఈ సినిమాకి మరింత బలాన్ని చేకూర్చింది. శరత్ బాబు తన పాత్రలో ఒదిగిపోయి చాలా బాగా నటించారు. తన పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. సుహాసిని కూడా తన పాత్రకి వంద శాతం న్యాయం చేసారని చెప్పుకోవచ్చు. విజయ్ కుమార్ తన మంచి పర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకున్నారు. వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ బాగానే వర్కౌట్ అయింది. చాలా కాలం తర్వాత నెగిటివ్ పాత్రలో కనిపించిన రాజీవ్ కనకాల తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పించారు.

సాంకేతిక వర్గం:

కాన్సెప్ట్ కొత్తగా ఉన్నప్పటికీ సతీష్ వేగేశ్న మళ్ళీ అంతకు ముందు సినిమాల లాగానే ఈ సినిమాలో కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ ను హైలైట్ చేయాలని ప్రయత్నించారు. కొన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సన్నివేశాలు ఉన్నప్పటికీ, కొన్ని వర్గాల ప్రేక్షకులు మాత్రం కథ కి అంతగా కనెక్ట్ అవ్వలేకపోవచ్చు.

అయితే నెరేషన్ పరంగా సతీష్ వేగేశ్న తనదైన శైలిలో కథని బాగానే ప్రజెంట్ చేశారు అని చెప్పుకోవచ్చు. నిర్మాతగా మారాక ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తాలు నిర్మించిన మొదటి చిత్రం అయినప్పటికీ సినిమా కోసం మంచి నిర్మాణ విలువలను అందించారు.

గోపి సుందర్ మ్యూజిక్ ఈ సినిమాకి చాలా బాగా ప్లస్ అయింది. పాటలు మాత్రమే కాకుండా సినిమాలోని బ్యాగ్రౌండ్ మ్యూజిక్, నేపథ్య సంగీతం కూడా ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేస్తుంది. ఈ సినిమా కోసం సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట మంచి అందమైన విజువల్స్ అందించారు. తమ్మిరాజు ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది.

బలాలు: నటీనటులు, ఫ్యామిలీ ఎమోషన్లు, కథ

బలహీనతలు: స్లో సన్నివేశాలు

First Published:  15 Jan 2020 5:10 AM GMT
Next Story