రీ-ఎంట్రీలో సానియా విజయారంభం

  • 2017 తర్వాత సానియా తొలివిజయం

అంతర్జాతీయ టెన్నిస్ లో సానియా ఓ మధురమైన విజయాన్ని సొంతం చేసుకొంది. ఓ బిడ్డకు తల్లిగా తొలివిజయం సాధించింది. మాతృత్వం కోసం గత రెండేళ్లుగా టెన్నిస్ నుంచి విరామం తీసుకొన్న సానియా 2020 సీజన్ రీఎంట్రీని విజయంతో మొదలుపెట్టింది.

ఆస్ట్ర్రేలియన్ మహిళల డబుల్స్ కు సన్నాహాలలో భాగంగా…ఉక్రెయిన్ ప్లేయర్ నాడియా కిచెనాక్ తో జంటగా …హోబర్ట్ ఇంటర్నేషనల్ టోర్నీ బరిలోకి దిగిన సానియాజోడీ గట్టి పోటీ ఎదుర్కొని తొలివిజయంతో క్వార్టర్ ఫైనల్స్ చేరుకోగలిగారు.

గంటా 41 నిముషాలపాటు సాగిన పోరులో సానియా జోడీ 2-6, 7-6, 10-3తో ఒకెసానా- మియు కాటోల జంటను అధిగమించగలిగారు. 2017లో చివరిసారిగా చైనా ఓపెన్ డబుల్స్ లో పాల్గొన్న తర్వాత…సానియా కెరియర్ లో ఇదే తొలివిజయం కావడం విశేషం.

అమ్మానాన్న తోడుగా…కుమారుడు చూస్తుండగా విజయంతో టెన్నిస్ పునరాగమనం చేయడం ఏదే తెలియని అనుభూతినిచ్చినట్లు సానియా ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.

సెమీఫైనల్లో చోటు కోసం జరిగే క్వార్టర్ ఫైనల్లో…వానియా కింగ్- క్రిస్టినా మెక్ హోల్ జోడీతో సానియా జంట తలపడాల్సి ఉంది.