Telugu Global
NEWS

అచ్చెన్నా... ఆ నాడు ఏం జరిగిందో కూడా చెప్పన్నా!

కోడి పందేల నిర్వహణ ముమ్మాటికీ తప్పే. వాటి కాళ్లకు కత్తులు కట్టి.. పందెంలో వాటి పోరాటాన్ని ఆనందించడం కూడా ఆమోదయోగ్యం కాదు. చాలా కాలంగా పోలీసులు కూడా ఆ పందేలపై ఉక్కుపాదం మోపేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తెలుగుదేశం హయాంలోనూ ఈ ప్రయత్నాలు జరిగాయి. కోడి పందేలను, జూదాలను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించి విఫలమైన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ.. ఇదేదీ మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్ నాయకుడు అచ్చెన్నాయుడుకు గుర్తున్నట్టు లేదు. కోడి పందేలు జరుగుతున్న […]

అచ్చెన్నా... ఆ నాడు ఏం జరిగిందో కూడా చెప్పన్నా!
X

కోడి పందేల నిర్వహణ ముమ్మాటికీ తప్పే. వాటి కాళ్లకు కత్తులు కట్టి.. పందెంలో వాటి పోరాటాన్ని ఆనందించడం కూడా ఆమోదయోగ్యం కాదు. చాలా కాలంగా పోలీసులు కూడా ఆ పందేలపై ఉక్కుపాదం మోపేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తెలుగుదేశం హయాంలోనూ ఈ ప్రయత్నాలు జరిగాయి. కోడి పందేలను, జూదాలను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించి విఫలమైన సందర్భాలు అనేకం ఉన్నాయి.

కానీ.. ఇదేదీ మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్ నాయకుడు అచ్చెన్నాయుడుకు గుర్తున్నట్టు లేదు. కోడి పందేలు జరుగుతున్న తీరుపై ఆవేశంతో ఊగిపోయిన ఆయన.. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జూదాన్ని నిర్వహిస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలే అని ఆరోపించారు. ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడుతూ లేఖ కూడా విడుదల చేశారు.

ఇక్కడ.. తమ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా..కోడి పందేలు, జూదాలు సంక్రాంతి సందర్భంగా జరిగాయని అచ్చెన్నాయుడు గుర్తు చేసుకోవాలి. వాస్తవానికి ఈ ప్రక్రియ తప్పే అయినా.. తమిళనాడులో జల్లికట్టు మాదిరిగా.. చిత్తూరు జిల్లాలో పశువుల పండగ మాదిరిగా.. కోడి పందేలన్నవి జనాల సెంటిమెంట్లతో ముడిపడి ఉన్నాయి. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని తేడా లేకుండా.. రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలు కోడి పందేలపై ఆసక్తి చూపిస్తుంటారు.

ఇలా కోడి పందేల బరులు ఏర్పాటు చేసిన చోట.. జూదాలు, ఇతర పోటీలనూ నిర్వహిస్తుంటారు. గతంలోనూ ఇలా జరిగిన దాఖలాలు ఉన్నాయి. ఈ చర్యలను అరికట్టేందుకు ప్రస్తుత సంక్రాంతి సందర్భంగా కూడా పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు. కొన్ని చోట్ల నిరసనలను ఎదుర్కొన్నారు. చివరికి ప్రజల్లో గొడవలు జరగకుండా ప్రక్రియ పూర్తి చేశారు. అది వారి విధి. ఇందులో ప్రభుత్వం పాత్ర ఏముందో.. ఈ విషయంలో గత ప్రభుత్వం ఏం చేసిందో.. అచ్చెన్నాయుడికే తెలియాలి. ఆవేశంతో ఊగిపోకుండా.. వ్యాఖ్యలు చేస్తే.. మంచిదన్న విషయాన్ని ఆయన గ్రహించాలి.

వాస్తవానికి ప్రజలకు ఈ విషయంలో అవగాహన రావాల్సిన అవసరం ఉంది. కోడి పందేలకు కత్తులు వాడకుండా నిర్వహిస్తే.. ఎవరికీ ఇబ్బంది ఉండదన్న నిజాన్ని అంతా గ్రహించాలి. ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే కాదు.. రాజకీయాల్లో ఉన్న ఇతర పార్టీల నేతలూ భాగం పంచుకోవాలి. అంతే కానీ.. ఇలా విమర్శలు చేసుకుంటూ పోతే.. చరిత్ర తవ్వుకోవడం తప్ప కలిగే లాభమైతే ఉండదు.

First Published:  15 Jan 2020 9:05 PM GMT
Next Story