Telugu Global
NEWS

చంద్రబాబు సవాల్ కు మంత్రి అవంతి ప్రతి సవాల్....

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు.. ఈ మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్ ప్రభుత్వానికి ఓ సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి జగన్ చేసిన 3 రాజధానుల ప్రతిపాదనపై ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజలు 3 రాజధానులకే అనుకూలంగా నిర్ణయం ఇస్తే.. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. ఈ సవాల్ పై.. అటు తెలుగుదేశంలోనూ ఇటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ లోనూ చర్చ బాగానే జరిగింది. ఇంతలో మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ విషయంలో […]

చంద్రబాబు సవాల్ కు మంత్రి అవంతి ప్రతి సవాల్....
X

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు.. ఈ మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్ ప్రభుత్వానికి ఓ సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి జగన్ చేసిన 3 రాజధానుల ప్రతిపాదనపై ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజలు 3 రాజధానులకే అనుకూలంగా నిర్ణయం ఇస్తే.. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. ఈ సవాల్ పై.. అటు తెలుగుదేశంలోనూ ఇటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ లోనూ చర్చ బాగానే జరిగింది.

ఇంతలో మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ విషయంలో స్పందించారు. చంద్రబాబు సవాల్ కు ప్రతి సవాల్ విసిరారు. శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న తెలుగుదేశం పార్టీనే.. ముందు రాజీనామాకు సిద్ధపడాలని స్పష్టం చేశారు. తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారందరినీ రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.

ఉప ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం ప్రస్తుత ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. తాము చంద్రబాబు వాదనే సరైందని ఒప్పుకొంటామని మంత్రి అవంతి తేల్చి చెప్పారు. ఇది తెలుసుకున్న ప్రజలు.. ఎక్కడ పోటీ జరిగితే ఏంటి.. ఎలా జరిగితే ఏంటి.. ఖర్చు తక్కువగా అవుతుంది.. తెలుగుదేశం ఎమ్మెల్యేలే రాజీనామా చేస్తే మంచిది కదా.. త్వరగా ప్రక్రియ పూర్తవుతుంది అని అభిప్రాయపడుతున్నారు.

మంత్రి అవంతి చెప్పిన విషయాల్లో మరో కీలక పాయింట్ ను కూడా కొందరు టచ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా జగన్ తీసుకున్న నిర్ణయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా మద్దతు తెలుపుతున్నారని అవంతి చెప్పారు. కానీ.. తెలుగుదేశం అధినేతగా చంద్రబాబు చేస్తున్న అమరావతి పోరాటానికి టీడీపీ ఎమ్మెల్యేలే పూర్తిగా సంఘీభావం తెలపడం లేదని… అలాంటప్పుడు చంద్రబాబు డిమాండ్ లో న్యాయం లేదని.. అవంతి చెప్పిందే బాగుందని కొందరి నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఓవరాల్ గా.. చంద్రబాబు ఇచ్చిన సవాల్ కంటే.. అవంతి చేసిన ప్రతి సవాల్ హాట్ టాపిక్ అవుతోంది. చంద్రబాబుతో పాటు.. టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారన్నది చూడాల్సి ఉంది.

First Published:  16 Jan 2020 12:01 AM GMT
Next Story