ఎంత మంచివాడవరు మొదటి రోజు వసూళ్లు

కల్యాణ్ రామ్ హీరోగా నటించిన సినిమా ఎంత మంచివాడవురా. సంక్రాంతి సీజన్ లో ఆఖరి చిత్రంగా వచ్చిన ఈ మూవీ నెగెటివ్ టాక్ మూటగట్టుకుంది. సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ, సంక్రాంతి సీజన్ కావడంతో మంచి ఓపెనింగ్స్ దక్కాయి. అలా ఎంత మంచివాడవురా మూవీకి వరల్డ్ వైడ్ 4 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 2 కోట్ల 20 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఫస్ట్ టైమ్ కల్యాణ్ రామ్ నటించిన ఈ సినిమా ఓ రీమేక్. గుజరాతీలో వచ్చిన ఆక్సిజన్ సినిమాకు రీమేక్ గా దీన్ని తెరకెక్కించారు. మెహ్రీన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందించాడు. ఏపీ, నైజాంలో ఈ సినిమాకు మొదటి రోజు వచ్చిన వసూళ్లు (షేర్) ఇలా ఉన్నాయి.

నైజాం – రూ. 0.65 కోట్లు
సీడెడ్ – రూ. 0.37 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.18 కోట్లు
ఈస్ట్ – రూ. 0.29 కోట్లు
వెస్ట్ – రూ. 0.20 కోట్లు
గుంటూరు – రూ. 0.19 కోట్లు
నెల్లూరు – రూ. 9 లక్షలు
కృష్ణా – రూ. 0.19 కోట్లు