అభిమానికి క్లాస్ పీకిన పూజా హెగ్డే

తనను కలవడానికి వచ్చిన ఓ అభిమానికి క్లాస్ పీకింది హీరోయిన్ పూజా హెగ్డే. అయితే ఇదంతా సీరియస్ గా కాదు, కేవలం అభిమానంతోనే ఈ పని చేసింది ఈ బుట్టబొమ్మ. ఈ ఘటన ముంబయిలో జరిగింది. పూజా హెగ్డే చేతిలో చివాట్లు తిన్న ఆ అభిమాని పేరు భాస్కర రావు. ఇప్పుడు మేటర్ లోకి వెళ్దాం.

పూజా హెగ్డేను చూడడం కోసం, ఆమెను కలవడం కోసం చాలా దూరం నుంచి ముంబయికి వచ్చాడు ఈ భాస్కర రావు. అయితే పూజా హెగ్డే ఊరిలో లేదని తెలుసుకున్నాడు. అలా అని అతడు వెనక్కి వెళ్లిపోలేదు. ముంబయిలోనే 5 రోజులు ఉండిపోయాడు. చేతిలో డబ్బుల్లేవ్. చలిలో రోడ్డు మీదే పడుకున్నాడు. అలా 5 రోజులు ఎదురుచూసి ఎట్టకేలకు పూజా హెగ్డేను కలుసుకున్నాడు.

ఈ విషయం తెలుసుకున్న పూజా, సుతారంగా భాస్కర్ రావును మందలించింది. ఇకపై ఇలాంటి పనులు చేయొద్దని, తన సినిమాలు చూస్తే చాలని చెప్పింది. అభిమానులంతా ఒక విషయం అర్థం చేసుకోవాలని, ఎవరు ఎక్కడున్నా వాళ్ల ప్రేమకు తను ఫీల్ అవుతానని, ఇంత దూరం వచ్చి ఇబ్బంది పడొద్దని విజ్ఞప్తి చేసింది. భాస్కర రావుకు షేక్ హ్యాండ్ ఇచ్చి పంపించేసింది.