Telugu Global
NEWS

ఆస్ట్ర్రేలియా అగ్నికీలల బాధితులకు భారీవిరాళం

ఫెదరర్ , నడాల్ 1, 72,000 డాలర్ల దాతృత్వం ఆస్ట్ర్రేలియాను గత కొద్దివారాలుగా అతలాకుతలం చేస్తూ వచ్చిన బడబాగ్ని బాధితుల సహాయం కోసం టెన్నిస్ సూపర్ స్టార్లు రోజర్ ఫెదరర్, రాఫెల్ నడాల్ భారీవిరాళం ఇచ్చి తమ పెద్దమనసును చాటుకొన్నారు. ఆస్ట్ర్రేలియాలోని అడవుల్లో వ్యాపించిన మంటల్లో..భారీ ప్రాణనష్టంతో పాటు కోటికి పైగా వన్యప్రాణులు అగ్నికి ఆహుతైపోయాయి. వేలకోట్ల రూపాయలు మేర ఆస్తినష్టం కూడా చోటు చేసుకొంది.   అయితే…మరికొద్దిరోజుల్లో ప్రారంభమయ్యే ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ లో పాల్గొనటానికి వచ్చిన గ్రాండ్ […]

ఆస్ట్ర్రేలియా అగ్నికీలల బాధితులకు భారీవిరాళం
X
  • ఫెదరర్ , నడాల్ 1, 72,000 డాలర్ల దాతృత్వం

ఆస్ట్ర్రేలియాను గత కొద్దివారాలుగా అతలాకుతలం చేస్తూ వచ్చిన బడబాగ్ని బాధితుల సహాయం కోసం టెన్నిస్ సూపర్ స్టార్లు రోజర్ ఫెదరర్, రాఫెల్ నడాల్ భారీవిరాళం ఇచ్చి తమ పెద్దమనసును చాటుకొన్నారు.

ఆస్ట్ర్రేలియాలోని అడవుల్లో వ్యాపించిన మంటల్లో..భారీ ప్రాణనష్టంతో పాటు కోటికి పైగా వన్యప్రాణులు అగ్నికి ఆహుతైపోయాయి. వేలకోట్ల రూపాయలు మేర ఆస్తినష్టం కూడా చోటు చేసుకొంది.

అయితే…మరికొద్దిరోజుల్లో ప్రారంభమయ్యే ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ లో పాల్గొనటానికి వచ్చిన గ్రాండ్ స్లామ్ స్టార్లు రోజర్ ఫెదరర్, రాఫెల్ నడాల్ …ఆస్ట్ర్రేలియా అగ్నికీలల బాధితుల సహాయం కోసం తమకుతాముగా 1, 72, 000 డాలర్ల మేర విరాళం ప్రకటించారు. ఇది ఆస్ట్ర్రేలియా డాలర్లలో 2, 50, 000 డాలర్లుగా ఉంది.

అంతేకాదు…ఆస్ట్ర్రేలియా అగ్నిబాధితుల సహాయార్థం కోసం…జరిగే టెన్నిస్ పోటీలలో…నడాల్, ఫెదరర్ తో పాటు జోకోవిచ్, సెరెనా విలియమ్స్, కారోలినా వోజ్నియాకీ, నవోమీ ఒసాకా, పెట్రా క్విటోవా, డోమనిక్ థీమ్, కోకా గాఫ్, నిక్ కిర్గిసో, స్టెఫానోస్ సిటిస్ పాస్, అలెగ్జాండర్ జ్వెరేవ్ పాల్గోనున్నారు.

అంతేకాదు…ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ లో నమోదయ్యే ఒక్కో ఏస్ కు వంద డాలర్లు చొప్పున నజరానాగా ఇవ్వనున్నారు. ఈ మొత్తాన్ని సైతం బాధితుల సహాయనిధికి జమ చేయనున్నారు.

First Published:  15 Jan 2020 9:46 PM GMT
Next Story