సరిలేకు నీకెవ్వరు 5 రోజుల వసూళ్లు

సంక్రాంతి కానుకగా విడుదలైన సరిలేరు నీకెవ్వరు సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి. నిన్నటితో 5 రోజుల రన్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 68 కోట్ల 22 లక్షల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఈ 5 రోజుల్లో సినిమా 80శాతం రికవర్ అయినట్టు నిర్మాతలు ప్రకటించారు.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను 76 కోట్ల రూపాయలకు అమ్మారు. సో.. ఈ వీకెండ్ నాటికి దాదాపు అన్ని ఏరియాల్లో ఈ సినిమా బ్రేక్-ఈవెన్ దాటి లాభాల బాట పట్టే ఛాన్స్ ఉంది. భారీగా థియేటర్లు దక్కడంతో, ఈ సినిమా మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశం ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 5 రోజుల్లో వచ్చిన వసూళ్లు (షేర్) ఇలా ఉన్నాయి.

నైజాం – రూ. 22.5 కోట్లు
సీడెడ్ – రూ. 9.75 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 10.05 కోట్లు
ఈస్ట్ – రూ. 6.22 కోట్లు
వెస్ట్ – రూ. 4.54 కోట్లు
గుంటూరు – రూ. 7.19 కోట్లు
నెల్లూరు – రూ. 2.42 కోట్లు
కృష్ణా – రూ. 5.55 కోట్లు