Telugu Global
National

అంతే తేడా: చిరంజీవి కలిపేశాడు... పవన్ జతకట్టాడు

రాజకీయ తెరపై సినీ అగ్ర తారలు… అన్నాదమ్ముల ప్రస్థానం ఒకేలా సాగేలా కనిపిస్తోంది. ప్రజారాజ్యం పెట్టి దూసుకొచ్చిన చిరంజీవి మొదటి ప్రయత్నంలోనే ఎన్నికల్లో 18సీట్లు సాధించి ఫర్వాలేదని అనిపించారు. అయితే తన పార్టీని కాంగ్రెస్ లో కలిపేసి పూర్తిగా రాజకీయాలకు దూరంగా జరిగారు. ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ అన్న కంటే ఘోరంగా 2019 ఎన్నికల్లో తొలిసారి పోటీచేసి రెండు చోట్లా ఓడిపోయారు. మొదట పొత్తుతో సపోర్టు చేసి బీజేపీ, టీడీపీలకు తోడ్పడ్డ పవన్.. తొలిసారి ఒంటరిగా […]

అంతే తేడా: చిరంజీవి కలిపేశాడు... పవన్ జతకట్టాడు
X

రాజకీయ తెరపై సినీ అగ్ర తారలు… అన్నాదమ్ముల ప్రస్థానం ఒకేలా సాగేలా కనిపిస్తోంది. ప్రజారాజ్యం పెట్టి దూసుకొచ్చిన చిరంజీవి మొదటి ప్రయత్నంలోనే ఎన్నికల్లో 18సీట్లు సాధించి ఫర్వాలేదని అనిపించారు. అయితే తన పార్టీని కాంగ్రెస్ లో కలిపేసి పూర్తిగా రాజకీయాలకు దూరంగా జరిగారు.

ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ అన్న కంటే ఘోరంగా 2019 ఎన్నికల్లో తొలిసారి పోటీచేసి రెండు చోట్లా ఓడిపోయారు. మొదట పొత్తుతో సపోర్టు చేసి బీజేపీ, టీడీపీలకు తోడ్పడ్డ పవన్.. తొలిసారి ఒంటరిగా బరిలోకి దిగి తేలిపోయాడు. స్వయంగా రెండు చోట్ల పోటీచేసి తను కూడా గెలవలేకపోయాడు.

అయితే అన్నలాగే పార్టీని విలీనం చేయడానికి పవన్ కు ధైర్యం చాల్లేదులా ఉంది. అందుకే కేంద్రంలో అధికారంలో ఉండి.. అపార నిధులు, క్యాడర్ కలిగిన బీజేపీతో జట్టుకట్టాడు. ఆ పార్టీ బలంతో రాజకీయాల్లో ఎదగాలని చూస్తున్నారు. మరి ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో తెలియాలంటే 2024 వరకూ వెయిట్ చేయాల్సిందే.

ఏపీలో బీజేపీ, జనసేన ప్రభావం చాలా తక్కువ. మరి ఈ రెండు పార్టీలు కలిస్తే ఎంత ప్రభావం చూపుతాయన్నది అంతుచిక్కని ప్రశ్న. వైసీపీ, టీడీపీకి మూడో ప్రత్యామ్మాయం అంటున్నా ఆస్థాయిలో ఏపీలో ఆదరణ లేదన్నది వాస్తవం. మరి చిరంజీవిలాగా విలీనం చేయకుండా బీజేపీతో కలిసిపోయిన పవన్ భవిష్యత్ ఏంటన్నది కాలమే నిర్ణయిస్తుంది.

First Published:  17 Jan 2020 1:40 AM GMT
Next Story