నాగచైతన్య-సమంత గెస్ట్ హౌజ్ రెడీ

నాగచైతన్య, సమంతకు ఇష్టమైన ప్రదేశం గోవా. టైమ్ దొరికినప్పుడల్లా గోవాకు చెక్కేస్తుంటుంది ఈ జంట. అంతెందుకు, చివరికి పెళ్లి కూడా కావాలనే గోవాలో చేసుకున్నారు. అంత ఇష్టం వీళ్లకు. ఇప్పుడా ఇష్టమే వీళ్లతో గోవాలో ఓ ప్లాట్ కొనేలా చేసింది. అవును.. గత ఏడాదిలోనే గోవాలో ఈ జంట ఓ స్థలం తీసుకుంది. అంతేకాదు, ఆ స్థలంలో కాస్ట్ లీ విల్లా కూడా కట్టుకుంటోంది. ఇప్పుడా విల్లా రెడీ అయింది.

దాదాపు 30 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ విల్లాను జాయింట్ గా కట్టించుకుంటున్నారు నాగచైతన్య-సమంత. త్వరలోనే ఆ విల్లాలో గృహప్రవేశం చేసి, ఇకపై ప్రతి వీకెండ్ అక్కడే గడపాలని నిర్ణయించుకున్నారు. ఇకపై గోవా వెళ్లిన ప్రతిసారి స్టార్ హోటల్స్ లో దిగి లక్షలు బిల్లు కట్టాల్సిన పనిలేదు వీళ్లకి. ఎంచక్కా సొంత విల్లాలోనే ఎంజాయ్ చేస్తారన్నమాట.

అన్నట్టు ఇదే ప్రాంతానికి దగ్గర్లో మరింత మంది టాలీవుడ్ ప్రముఖులు స్థలాలు తీసుకున్నారు. వాళ్లు కూడా నాగచైతన్య-సమంత బాటలో అక్కడ విల్లాలు కట్టుకునే ఆలోచనలో ఉన్నారు. ఈ లిస్ట్ లో అందరికంటే ముందున్నాడు రానా. ఈ ఏడాదిలోనే రానా అక్కడ ఓ విల్లా ప్లాన్ చేస్తున్నాడు.