6 రోజుల్లో 78 కోట్లు

సంక్రాంతి సినిమాల మధ్య వసూళ్ల పోటీ నడుస్తూనే ఉంది. నిన్నటికి నిన్న అల్లు అర్జున్ తన సినిమాకు సంబంధించి పోస్టర్ రిలీజ్ చేశాడు. అల వైకుంఠపురములో సినిమా నాన్-బాహుబలి రికార్డులు సృష్టించినట్టు చెప్పుకున్నాడు. ఆ పోస్టర్ వచ్చి 24 గంటలైనా కాకముందే మహేష్ బాబు నుంచి లెక్కలు బయటకొచ్చాయి.

సరిలేరు నీకెవ్వరు సినిమా నిన్నటితో 6 రోజుల రన్ పూర్తిచేసుకుంది. ఈ 6 రోజుల్లో సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 77 కోట్ల 94 లక్షల రూపాయల షేర్ వచ్చినట్టు ప్రకటించుకున్నారు మేకర్స్. నైజాంలో ఇప్పటికే నాన్-బాహుబలి రికార్డు సృష్టించినట్టు చెప్పుకున్న యూనిట్.. తమ సినిమాను సంక్రాంతి ఛాంపియన్ అని చెబుతూ లెక్కలతో పాటు పోస్టర్ ను రిలీజ్ చేసింది.

ఏపీ, నైజాంలో ఈ సినిమాను 76 కోట్ల రూపాయలకు (హయ్యర్స్ కాకుండా) అమ్మారు. తాజా లెక్కలతో సరిలేరు నీకెవ్వరు సినిమా బ్రేక్-ఈవెన్ అయినట్టయింది. ఇక ఈ రోజు నుంచి సినిమాకు వచ్చిన ప్రతి పైసా లాభం కిందే లెక్క. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 6 రోజుల్లో వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి

నైజాం – రూ. 25.65 కోట్లు
సీడెడ్ – రూ. 11.35 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 11.80 కోట్లు
ఈస్ట్ – రూ. 7.23 కోట్లు
వెస్ట్ – రూ. 5.06 కోట్లు
గుంటూరు – రూ. 7.72 కోట్లు
నెల్లూరు – రూ. 2.86 కోట్లు
కృష్ణా – రూ. 6.27 కోట్లు