Telugu Global
Cinema & Entertainment

కలెక్షన్ల యుద్ధం: మహేష్, బన్నీ అతడి నుంచి నేర్చుకోవాల్సిందేనా?

టాలీవుడ్ లో ఇప్పుడు కలెక్షన్ల యుద్ధం నడుస్తోంది. సంక్రాంతికి రిలీజ్ అయిన మహేష్ బాబు ‘సరిలేరు, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురం’ రెండు హిట్ కావడంతో కలెక్షన్లపై కాకిలెక్కలు చెబుతూ తామే సంక్రాంతి విన్నర్ లు అంటూ ఎవరికి వారు గొప్పలు చెప్పుకుంటున్నారు. బ్లాక్ బస్టర్ అని… ఇన్ని మిలియన్లు వసూలు చేసిందంటూ… ఏకంగా పోస్టర్లు విడుదల చేస్తుండడం విశేషం. అయితే ఈ ధోరణి అభిమానులను, ప్రజలను గందరగోళానికి గురిచేస్తోంది. ప్రొడక్షన్ హౌస్ లు విడుదల చేసే […]

కలెక్షన్ల యుద్ధం: మహేష్, బన్నీ అతడి నుంచి నేర్చుకోవాల్సిందేనా?
X

టాలీవుడ్ లో ఇప్పుడు కలెక్షన్ల యుద్ధం నడుస్తోంది. సంక్రాంతికి రిలీజ్ అయిన మహేష్ బాబు ‘సరిలేరు, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురం’ రెండు హిట్ కావడంతో కలెక్షన్లపై కాకిలెక్కలు చెబుతూ తామే సంక్రాంతి విన్నర్ లు అంటూ ఎవరికి వారు గొప్పలు చెప్పుకుంటున్నారు. బ్లాక్ బస్టర్ అని… ఇన్ని మిలియన్లు వసూలు చేసిందంటూ… ఏకంగా పోస్టర్లు విడుదల చేస్తుండడం విశేషం.

అయితే ఈ ధోరణి అభిమానులను, ప్రజలను గందరగోళానికి గురిచేస్తోంది. ప్రొడక్షన్ హౌస్ లు విడుదల చేసే ఈ ప్రకటనలు నిజమే అయినప్పటికీ ఎవరూ నమ్మలేకపోతున్నారు. సోషల్ మీడియాలో అయితే ఈ వసూళ్లపై ట్రోల్స్, మీమ్స్ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహేష్, బన్నీ పరస్పర కలెక్షన్ల రేసు ఇండస్ట్రీలోని వారికి కూడా చికాకు పుట్టిస్తోందట.

మహేష్, అల్లు అర్జున్ ఇద్దరూ ఇప్పుడు హీరో రామ్ చరణ్ ను ఆదర్శంగా తీసుకోవాలని టాలీవుడ్ పెద్దలు సూచిస్తున్నారట.. ‘మగధీర’ బాక్సాఫీస్ హిట్ అయినా కలెక్షన్లను మాత్రం రాంచరణ్ ప్రకటించలేదు. ఇక రంగస్థలం నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టినా ఆ లెక్కను చరణ్ బయటపెట్టలేదు.

ఇక నిర్మాతగా రాంచరణ్ తీసిన ఖైదీనంబర్ 150, ‘సైరా’ మూవీలు కూడా ఊహించని కలెక్షన్లు సాధించినా రాంచరణ్ ఎన్నడూ కలెక్షన్ల లెక్కలను పోస్టర్లుగా ప్రకటించి హంగామా సృష్టించలేదు. కానీ మహేష్, అల్లు అర్జున్ లు ఇప్పుడు కలెక్షన్లు మావే ఎక్కువ అంటూ రచ్చ చేస్తున్నారు. ఐటీ, సహా కేంద్రంలోని పన్నుల అధికారులకు టార్గెట్ అవుతున్నారు.

ఇప్పటికైనా కలెక్షన్ల విషయంలో మహేష్, అల్లు అర్జున్ లు రాంచరణ్ ను అనుసరించాలని.. ఆయనలా కలెక్షన్లపై నోరు మెదపకపోవడమే మంచిదని టాలీవుడ్ పెద్దలు సూచిస్తున్నారు. అభిమానుల మధ్య యుద్ధానికి కారణమవుతున్న మహేష్, బన్నీ వైఖరిపై అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు.

First Published:  17 Jan 2020 1:05 AM GMT
Next Story