Telugu Global
NEWS

మూడేళ్ల తర్వాత సెరెనాకు టైటిల్

అక్లాండ్ క్లాసిక్ క్వీన్ సెరెనా విలియమ్స్ అమెరికన్ బ్లాక్ థండర్, ప్రపంచ మాజీ నంబర్ వన్ సెరెనావిలియమ్స్ మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తొలి డబ్లుటిఏ టైటిల్ నెగ్గి విజయాల కొరతను తీర్చుకొంది. ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ కు సన్నాహాలలో భాగంగా జరిగిన డబ్లుటిఏ అక్లాండ్ క్లాసిక్ టైటిల్ ను సెరెనా సొంతం చేసుకొంది. తన కూతురు ఒలింపియాతో కలసి ట్రోఫీని అందుకొని మురిసిపోయింది. 2017లో చివరిసారిగా ఓ టైటిల్ నెగ్గిన సెరెనా ఆ తర్వాత మాతృత్వం కోసం టెన్నిస్ […]

మూడేళ్ల తర్వాత సెరెనాకు టైటిల్
X
  • అక్లాండ్ క్లాసిక్ క్వీన్ సెరెనా విలియమ్స్

అమెరికన్ బ్లాక్ థండర్, ప్రపంచ మాజీ నంబర్ వన్ సెరెనావిలియమ్స్ మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తొలి డబ్లుటిఏ టైటిల్ నెగ్గి విజయాల కొరతను తీర్చుకొంది.

ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ కు సన్నాహాలలో భాగంగా జరిగిన డబ్లుటిఏ అక్లాండ్ క్లాసిక్ టైటిల్ ను సెరెనా సొంతం చేసుకొంది. తన కూతురు ఒలింపియాతో కలసి ట్రోఫీని అందుకొని మురిసిపోయింది.

2017లో చివరిసారిగా ఓ టైటిల్ నెగ్గిన సెరెనా ఆ తర్వాత మాతృత్వం కోసం టెన్నిస్ కు దూరమయ్యింది. ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత…తన తొలిటైటిల్ కోసం మూడేళ్లపాటు పోరాడాల్సి వచ్చింది.

అక్లాండ్ ఓపెన్ ఫైనల్లో విజేతగా నిలవడం ద్వారా తన కెరియర్ టైటిల్స్ సంఖ్యను 73కు పెంచుకోగలిగింది. మరికొద్దిరోజుల్లో ప్రారంభమయ్యే ఆస్ట్ర్రేలియన్ ఓపెన్లో పాల్గొనడం ద్వారా 24వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కు సెరెనా గురిపెట్టింది.

అక్లాండ్ టైటిల్ విజయంతో లభించిన 43వేల డాలర్ల ప్ర్రైజ్ మనీని ఆస్ట్ర్రేలియా దావానలం బాధితులకు విరాళంగా ప్రకటించింది.

గత మూడేళ్ళ కాలంలో నాలుగుగ్రాండ్ స్లామ్ ఫైనల్స్ చేరినా టైటిల్ సాధించలేకపోయిన 38 ఏళ్ల సెరెనా…ఆ లోటును 2020 ఆస్ట్ర్రేలియన్ ఓపెన్లో తీర్చుకోవాలన్న పట్టుదలతో ఉంది.

1960- 1973 మధ్యకాలంలో 24 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన మార్గారెట్ కోర్టు రికార్డును సెరెనా సమం చేయాలన్న పట్టుదలతో ఉంది. ఇప్పటికే తన కెరియర్ లో 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన సెరెనా 24వ టైటిల్ కోసం ఎక్కడలేని ఓర్పుతో ఎదురుచూస్తోంది.

First Published:  16 Jan 2020 9:32 PM GMT
Next Story