గో మాంసం నుంచి కోడిగుడ్డు దాకా….

బీజేపీ అధికారంలోకి రాగానే గో మాంస భక్షణ పై తీవ్ర ఆందోళన చేసింది. పవిత్రమైన గో మాత మాంసం ఈ దేశంలో ఎవరూ తినడానికి వీలులేదని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు హుకుం జారీ చేశారు. గోవులను తరలిస్తున్న వారిపై దాడులు చేశారు. కొంతమందిని చంపేశారు కూడా. ఇలా దాడులు చేసిన వారిలో ఓబీసీలే ఎక్కువమంది.

అప్పుడు కొందరు కమ్యూనిస్టులు ఒక విమర్శ చేశారు.

ఇప్పుడు గో మాంసం మీద నిషేదం విధించిన వాళ్ళు రేపు మాంసాహారం మీదే నిషేధం విదిస్తే ఇప్పుడు వీరంగాలు వేసే మాంసాహారం తినే ఓబీసీలంతా ఏం చేస్తారని ప్రశ్నించారు.

ఇప్పుడు ఆ పరిస్థితి రానే వచ్చింది. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వ విద్యాసంస్థల్లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజనంతో పాటు విద్యార్ధులకు కోడిగుడ్డు ఇవ్వాలని నిర్ణయించింది. దీనిని అక్కడి బీజేపీ నేతలు తప్పుపడుతున్నారు. కోడిగుడ్డు ఇవ్వడం వల్ల కొందరి మనోభావాలు దెబ్బతింటాయని కాబట్టి మధ్యాహ్న భోజనంతో పాటు కోడిగుడ్డు ఇవ్వాలనే ఆలోచనను విరమించుకోవాలని చెబుతున్నారు.