Telugu Global
NEWS

వైసీపీ ఎమ్మెల్యేలకు లోకేష్‌ హెచ్చరిక

అమరావతి కోసం ఉండవల్లిలో జేఏసీ ఆధ్వర్యంలో ప్రజాబ్యాలెట్‌ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్‌… గుంటూరు, కృష్ణా జిల్లాల వైసీపీ ప్రజాప్రతినిధులకు హెచ్చరిక జారీ చేశారు. అమరావతి కోసం వెంటనే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి పోరాటంలో పాల్గొనాలని, తాను హెచ్చరిక జారీ చేస్తున్నానన్నారు‌. ముఖ్యమంత్రి పై ఒత్తిడి పెంచాలని… మీరు రాజీనామా చేయకుండా డ్రామాలు ఆడితే మటుకు మీరు రెండు జిల్లాల్లో తిరిగే పరిస్థితి ఉండదని హెచ్చరిక జారీచేస్తున్నాను అంటూ… ఆవేశంగా మాట్లాడారు […]

వైసీపీ ఎమ్మెల్యేలకు లోకేష్‌ హెచ్చరిక
X

అమరావతి కోసం ఉండవల్లిలో జేఏసీ ఆధ్వర్యంలో ప్రజాబ్యాలెట్‌ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్‌… గుంటూరు, కృష్ణా జిల్లాల వైసీపీ ప్రజాప్రతినిధులకు హెచ్చరిక జారీ చేశారు.

అమరావతి కోసం వెంటనే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి పోరాటంలో పాల్గొనాలని, తాను హెచ్చరిక జారీ చేస్తున్నానన్నారు‌. ముఖ్యమంత్రి పై ఒత్తిడి పెంచాలని… మీరు రాజీనామా చేయకుండా డ్రామాలు ఆడితే మటుకు మీరు రెండు జిల్లాల్లో తిరిగే పరిస్థితి ఉండదని హెచ్చరిక జారీచేస్తున్నాను అంటూ… ఆవేశంగా మాట్లాడారు లోకేష్‌. ప్రభుత్వానికి కూడా ఒక మాట చెబుతున్నాను అనగానే మైక్‌ చెడిపోవడంతో మరో మైక్‌ ను లోకేష్‌ కు ఇచ్చారు అక్కడి సభ్యులు.

ప్రపంచంలో ఒకే ఒక దేశంలో మూడు రాజధానులు ఉన్నాయి…. 194 దేశాలు ఒకేఒక్క రాజధానిని ప్రకటించి ముందుకెళ్తున్నాయన్నారు లోకేష్‌. రాజధాని అనేది ఒక ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని… అది గుర్తుంచుకోవాలన్నారు టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్‌.

ఎన్ని బలగాలను దింపినా రైతుల మనసు మాత్రం మారదు… ఉద్యమం ఆగదు… రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని అంటూ ప్రజల ముందుకు వెళ్తామని గర్జించారు లోకేష్‌. మూడు ముక్కలుగా రాజధానిని చేయడం కరెక్ట్‌ కాదు… అభివృద్ధి వికేంద్రీకరణ ఎలా చేస్తారంటూ మంత్రులను సూటిగా ప్రశ్నిస్తున్నానన్నారు లోకేష్.

జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల్లో మంగళగిరి నియోజక వర్గ వాసుడిగా, ఆంధ్రుడిగా నిలబడతానన్నారు లోకేష్‌. విలేకరుల ప్రశ్నలకు కూడా సమాధానం ఇచ్చారు లోకేష్‌. రేపు టీడీఎల్పీ సమావేశం జరగబోతోందని, ఈ మూడు రాజధానులు ఎలా తీసుకొస్తారు?ఎలాంటి బిల్లు వస్తుంది? అన్న దాని పైన తమ కార్యాచరణ ఎలా ఉంటుంది? అనేది ఈ సమావేశంలో చర్చిస్తామన్నారు లోకేష్‌.

First Published:  18 Jan 2020 6:54 AM GMT
Next Story