Telugu Global
NEWS

రోహిత్ శర్మ 7వేల పరుగుల రికార్డు

వన్డేల్లో అత్యంతవేగంగా 7వేల పరుగుల ఓపెనర్ భారత డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ…వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 7వేల పరుగుల మైలురాయిని చేరిన తొలి క్రికెటర్ గా నిలిచాడు. ఇప్పటి వరకూ సౌతాఫ్రికా మాజీ ఓపెనర్ హషీమ్ ఆమ్లా పేరుతో ఉన్న రికార్డును రోహిత్ అధిగమించాడు. ఆస్ట్ర్రేలియాతో తీన్మార్ వన్డే సిరీస్ లో భాగంగా రాజ్ కోటలోని సౌరాష్ట్ర్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా ముగిసిన రెండో వన్డేలో 42 పరుగుల స్కోరు సాధించడం ద్వారా రోహిత్ ఈ […]

రోహిత్ శర్మ 7వేల పరుగుల రికార్డు
X
  • వన్డేల్లో అత్యంతవేగంగా 7వేల పరుగుల ఓపెనర్

భారత డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ…వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 7వేల పరుగుల మైలురాయిని చేరిన తొలి క్రికెటర్ గా నిలిచాడు. ఇప్పటి వరకూ సౌతాఫ్రికా మాజీ ఓపెనర్ హషీమ్ ఆమ్లా పేరుతో ఉన్న రికార్డును రోహిత్ అధిగమించాడు.

ఆస్ట్ర్రేలియాతో తీన్మార్ వన్డే సిరీస్ లో భాగంగా రాజ్ కోటలోని సౌరాష్ట్ర్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా ముగిసిన రెండో వన్డేలో 42 పరుగుల స్కోరు సాధించడం ద్వారా రోహిత్ ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు.

137 ఇన్నింగ్స్ లోనే 7వేల పరుగులు

సఫారీ ఓపెనర్ హషీమ్ ఆమ్లా 7వేల పరుగులు సాధించడానికి 147 ఇన్నింగ్స్ ఆడితే …రోహిత్ శర్మ మాత్రం కేవలం 137 ఇన్నింగ్స్ లోనే 7వేల పరుగుల ఘనతను సొంతం చేసుకోగలిగాడు.

మాస్టర్ సచిన్ టెండుల్కర్ 160 ఇన్నింగ్స్ లో కానీ 7వేల పరుగులు సాధించలేకపోయాడు.

వన్డే క్రికెట్లో మిడిలార్డర్ బ్యాట్స్ మన్ గా తన కెరియర్ ప్రారంభించిన రోహిత్ ను 2013 సీజన్ నుంచి… అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సూచన మేరకు…ఓపెనర్ గా తన ప్రస్థానం ప్రారంభించాడు.

భారత నాలుగో క్రికెటర్ రోహిత్…

వన్డే క్రికెట్లో ఓపెనర్ గా 7వేల పరుగులు సాధించిన భారత నాలుగో క్రికెటర్ గా రోహిత్ శర్మ రికార్డుల్లో చేరాడు. రోహిత్ కంటే ముందుగానే ఈ ఘనత సాధించిన భారత ఓపెనర్లలో సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ ఉన్నారు.

అయితే…వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 9వేల పరుగుల ప్రపంచ రికార్డును సాధించడంలో రోహిత్ కేవలం 4 పరుగుల దూరంలో విఫలమయ్యాడు.

First Published:  17 Jan 2020 11:38 PM GMT
Next Story