Telugu Global
Cinema & Entertainment

సరిలేరు నీకెవ్వరు ఫస్ట్ వీక్ వసూళ్లు

మహేష్ హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా నిన్నటితో ఫస్ట్ వీక్ పూర్తి చేసుకుంది. ఈ 7 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయల షేర్ సాధించినట్టు మేకర్స్ ప్రకటించారు. ఆశ్చర్యకరంగా రాత్రి జరిగిన సక్సెస్ సంబరాల్లోనే ఈ పోస్టర్ ను విడుదల చేశారు. నిజానికి లెక్కలన్నీ తేలడానికి కాస్త టైమ్ పడుతుంది. కానీ 7వ రోజు రన్ పూర్తికాకుండా వంద కోట్ల షేర్ అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సంగతి పక్కనపెడితే.. […]

సరిలేరు నీకెవ్వరు ఫస్ట్ వీక్ వసూళ్లు
X

మహేష్ హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా నిన్నటితో ఫస్ట్ వీక్ పూర్తి చేసుకుంది. ఈ 7 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయల షేర్ సాధించినట్టు మేకర్స్ ప్రకటించారు. ఆశ్చర్యకరంగా రాత్రి జరిగిన సక్సెస్ సంబరాల్లోనే ఈ పోస్టర్ ను విడుదల చేశారు. నిజానికి లెక్కలన్నీ తేలడానికి కాస్త టైమ్ పడుతుంది. కానీ 7వ రోజు రన్ పూర్తికాకుండా వంద కోట్ల షేర్ అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ సంగతి పక్కనపెడితే.. ఈ 7 రోజుల్లో వరల్డ్ వైడ్ ఈ సినిమాకు 105 కోట్ల 56 లక్షల రూపాయల షేర్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మొదటి వారం 85 కోట్ల 56 లక్షల రూపాయల షేర్ వచ్చింది. అటు నైజాంలో ఈ సినిమా 27 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి, 30 కోట్ల మార్క్ అందుకోవడానికి రెడీ అవుతోంది.

నైజాం – రూ. 27.7 కోట్లు
సీడెడ్ – రూ. 12.4 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 13.5 కోట్లు
గుంటూరు – రూ. 8.16 కోట్లు
ఈస్ట్ – రూ. 8.19 కోట్లు
వెస్ట్ – రూ. 5.61 కోట్లు
కృష్ణా – రూ. 6.87 కోట్లు
నెల్లూరు – రూ. 3.13 కోట్లు

First Published:  18 Jan 2020 7:01 AM GMT
Next Story