‘సరిలేరు’ సినిమాకు కత్తెర…. యూనిట్ షాకింగ్ నిర్ణయం?

సంక్రాంతికి రిలీజ్ అయ్యి హిట్ టాక్ తో విజయవంతంగా నడుస్తోంది ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా. తాజాగా హీరో మహేష్ బాబు కూడా సక్సెస్ మీట్ లకు హాజరవుతూ సినిమాకు మరింత ప్రమోషన్ చేస్తున్నారు. ఇప్పటికే దేశంలో, ఓవర్సీస్ లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

అయితే సినిమా నిడివి ఎక్కువగా ఉండడం.. పలు కామెడీ సీన్లు పండకపోవడంతో ప్రేక్షకుల టాక్ ప్రకారం కొన్ని సీన్లకు కత్తెర వేయడానికి సినిమా యూనిట్ సిద్ధమైనట్టు సమాచారం.

సరిలేరు సినిమా రిలీజ్ కు ముందే ‘ట్రైన్ ఎపిసోడ్’ అంటూ దర్శకుడు, సినిమా యూనిట్ ఊదరగొట్టింది. బ్లేడ్ బాబ్జీగా బండ్ల అదరగొడతారని ప్రచారం చేశారు. అయితే అది అనుకున్నంత వర్కవుట్ కాలేదు. ఇక సుబ్బరాజ్, వెన్నెల కిషోర్ పాత్రలూ అనవసరం అని టాక్ వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో సినిమాలోని అనవసరమైన సీన్లకు చిత్ర యూనిట్ కత్తెరవేసిందట.. ఈ శనివారం నుంచి బండ్ల గణేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్ సీక్వెన్స్ సీన్లను ఎడిట్ చేశారని.. సినిమా నిడివి తగ్గించారని.. ఈ శనివారం నుంచి ఎడిటెడ్ వెర్షన్ ప్రచారం చేస్తారని వార్తలు వస్తున్నాయి.